Social News XYZ     

‘Chaurya Patham’ creates ruckus on OTT

ఓటీటీలో 'చౌర్య పాఠం' అరాచకం.. చిన్న సినిమా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..?

అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ఒక పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం (Chaurya paatam)'. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిందీ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తూ, డిజిటల్ స్క్రీన్లను ఏలేస్తోంది. స్టార్ల హంగామా, భారీ సెట్టింగుల ఆర్భాటం లేకపోయినా, ఈ సినిమా స్టోరీతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది.

అసలు ఇంతలా ప్రేక్షకాదరణ పొందడానికి కారణమేంటి? భారీ క్యాస్ట్ లేదు, కళ్లు చెదిరే బడ్జెట్టూ లేదు. కేవలం ఓ కొత్త దర్శకుడి సాహసోపేతమైన ప్రయత్నం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన.. ఇవే ఈ సినిమాని సూపర్ హిట్ చేశాయి. పేరులో 'చౌర్యం' అని ఉన్నా, సినిమా చూశాక వచ్చే ఫీలింగే వేరు. ఇది దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా, అంతర్లీనంగా నిజాయితీ, ధైర్యం, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను స్పృశిస్తూ, ప్రతి ఒక్కరి గుండెను తడుతుంది.

 

"ఇదొక కొత్త తరహా సినిమా అనుభూతి", "మనసును కదిలించే ప్రయాణం" అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను హోరెత్తిస్తున్నారు. అందుకే, 'చౌర్య పాఠం' కేవలం ఒక సినిమాగా మిగిలిపోలేదు, OTT వేదికపై ఓ లైవ్ డిస్కషన్‌కు దారి తీసింది. సాధారణంగా కనిపించే కథలో అసాధారణమైన లోతును చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ. చూస్తే మీకే తెలుస్తుంది, ఈ పాఠం ఎంత విలువైనదో. మిస్ అవ్వకండి.

Facebook Comments
'Chaurya Patham' creates ruckus on OTT

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.