Social News XYZ     

Kamal Hassan – Lyca Productions “Bharateeyudu2” – Press Meet

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే మంచి సందేశాత్మక చిత్రం.. ‘భారతీయుడు 2’ ప్రెస్ మీట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్

https://youtube.com/playlist?list=PLv8tne3UD07O2U1ZqKodh4tKlXyaa4BYh

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో..

 

Bharateeyudu 2 (Telugu) Press Meet (8th July) Full Feed - Copyright FREE content for all the MEDIA
https://we.tl/t-8u7aNcAeI5

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. తెలుగులోనే నాకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. భారతీయుడు 2లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజంలోంచి వచ్చినట్టే ఉంటాయి. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే.. ఒకటి ఓటు వేసేది.. రెండోది మన బాధ్యతది చెప్పేది. సాంగ్, ఫైట్స్ ఉన్నాయా? అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు. అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. నేను గురువు అని సిద్దార్థ్ ప్రతీ సారి చెబుతుంటాడు. అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెబుతుండేవాడిని. సిద్దార్థ్, నేను ఒక ఏకలవ్య శిష్యులం. ఇంకా కమల్ హాసన్ లాంటి వారు రావాలి.. సిద్దార్థ్ లాంటి వారు వస్తూ ఉండాలి. ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. భారతీయుడు 2 చిత్రాన్ని అందరూ వీక్షించండి. ఈ సినిమాలోని మెసెజ్ అందరికీ చేరాలి. అందుకోసం మీడియా మాకు సహకరించాలి. ఈ సినిమాను జనాల వరకు తీసుకెళ్లండి. జూలై 12న మా చిత్రాన్ని థియేటర్లో చూడండి’ అని అన్నారు.

శంకర్ మాట్లాడుతూ.. ‘భారతీయుడు టైంలో సీక్వెల్ తీస్తానని అనుకోలేదు. ఆ మూవీ తరువాత ఇన్నేళ్లలో ఎక్కడ లంచం తీసుకున్నారనే వార్తలు చదివినా నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. 2.ఓ తరువాత నాకు స్టోరీ కుదరడం, కమల్ హాసన్ గారికి చెప్పడంతో ఈ సినిమా మొదలైంది. నేను ఓ సీన్‌ను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటుంది. ప్రతీ ఒక్క ఆడియెన్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లే ప్రతీ ఆడియెన్ మైండ్‌లో ఓ ఆలోచన పుడుతుంది. ప్రతీ ఒక్క టెక్నీషియన్ కోసం ఈ సినిమాను చూడొచ్చు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్న సురేష్ బాబు గారికి థాంక్స్. జూలై 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘భారతీయుడు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. సమాజంలో ఉన్న కరప్షన్‌ను చూసి కోపం వస్తూనే ఉంటుంది. భారతీయుడు 2 అనేది ఓ యాంటీ వైరస్ లాంటిది. సమాజంలోని వైరస్‌ను తీసేందుకు శంకర్ గారు తీసుకొచ్చిన అప్డేటెడ్ యాంటి వైరస్ ఈ మూవీ. కమల్ హాసన్ గారు నాకు ఇష్టమైన హీరో. జయసుధ గారు నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారు. ఈ చిత్రంలో నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ గారికి థాంక్స్. ఓ క్రిష్టోఫర్ కొలంబస్‌లా శంకర్ గారు నన్ను కనిపెట్టి హీరోగా తీసుకొచ్చారు. మళ్లీ 20 ఏళ్ల తరువాత అవకాశం ఇచ్చారు. నా ఫస్ట్ 20 ఏళ్ల కెరీర్ బాయ్స్‌తో గడిపేశా.. రాబోయే 20 ఏళ్లు భారతీయుడు 2తో గడిపేస్తా. యువత ఈ సమాజం కోసం ఏం చేయాలో చెప్పే చిత్రం అవుతుంది. జూలై 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూసిన వెంటనే శంకర్ గారి నంబర్ కనుక్కుని మెసెజ్ చేశాను. కమల్ హాసన్ గారు మన ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. సోషల్ మెసెజ్ ఇస్తూ, ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తూ తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. జెంటిల్‌మెన్ సినిమా ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. నేను కూడా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని నడుపుతున్నాను. నిజాయితీ మనం ఏదైనా చేస్తే వచ్చే సంతోషం మామూలుగా ఉండదు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నామ’ని అన్నారు.

బాబీ సింహా మాట్లాడుతూ.. ‘భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇండియన్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ గారికి థాంక్స్. సినిమాకు ఇంకో పేరు అంటే అది కమల్ హాసన్ గారు మాత్రమే. లవ్ ఫెయిల్యూర్ సినిమాకు సిద్దార్థ్ నిర్మాత. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘భారతీయుడు సినిమా సీక్వెల్‌లో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. కమల్ హాసన్ సర్‌తో పని చేయడం అంటే కల నెరవేరినట్టే. సిద్దార్థ్‌తో నటించడం ఆనందంగా ఉంది. యూనిట్ అంతా కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశాం. సురేష్ బాబు గారు ఈ సినిమాను భారీ ఎత్తున జూలై 12న విడుదల చేస్తున్నారు. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

Facebook Comments
Kamal Hassan - Lyca Productions "Bharateeyudu2" - Press Meet

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.