Social News XYZ     

Gam Gam Ganesha is good action comedy entertainer that will impress audience big time – Producer Vamsi Karumanchi

Producer Vamsi Karumanchi is making his Tollywood debut with the movie "Gam Gam Ganesha" starring Anand Devarakonda. He produced this film with his friend Kedar Selagamshetty under the banner of Hylife Entertainments. Directed by Uday Shetty, "Gam Gam Ganesha" is an action crime comedy movie slated for a grand theatrical release on the 31st of this month. In an interview, producer Vamsi Karumanchi discussed the film's features and his experiences as a producer.

"Our roots are in Guntur. We moved to the US for work and business but returned to India during the lockdown. Due to travel restrictions, we couldn't go back to the US. Since childhood, I've been a movie enthusiast and a fan of Balakrishna. Even in the US, we watched all Telugu movies, often surprising others with our enthusiasm in theaters. We initially planned to stay in the US for a few more years before returning to India to settle down and produce films. However, the lockdown altered our plans, and we started this film with Anand. Anand and Vijay are good friends of mine."

"When director Uday Shetty narrated the story, Anand liked it. Initially, there was some doubt if Anand would take on such a role, but he found it refreshing and agreed. Anand plays a funky character that's somewhat brash and daring. 'Gam Gam Ganesha' revolves around a Ganesh statue and money, blending action and comedy. We initially aimed to release it during Vinayaka Chavithi but postponed it due to industry strikes and Anand's involvement in 'Baby.' We then planned a release for the 25th of this month but shifted to the 31st to avoid clashing with Dil Raju's 'Love Me.'"

 

"'Gam Gam Ganesha' is being distributed by Mythri Movie Distributors in Nizam and Dheeraj Mogilineni Entertainments in AP and Karnataka, with over 400 theaters secured. We believe it’s a substantial release. We also have an OTT deal with Amazon Prime."

"Anand's role in 'Gam Gam Ganesha' is unique and should not be compared to his role in 'Baby,' which is a love-emotional movie. In contrast, this film is a crime comedy action movie, with particularly impressive comedy. The situations involving friends getting into trouble generate a lot of laughter, with Jabardast Emmanuel delivering humor. Heroines Nayan Sarika and Pragathi Srivastava gave strong performances, with significant roles in the film. Following the success of 'Baby,' we believe this release will benefit us."

"Directors often struggle to bring crime comedy genres to life as well as they narrate them, but Uday has executed 'Gam Gam Ganesha' excellently, even surpassing the narration. The budget was significant, but the quality is evident. Everyone in our circle who saw the movie praised it."

"The film industry is complex compared to others. Though it may seem small, millions depend on it for their livelihood, and it contributes significantly to sectors like IT. Every business involves risk, and film production is no different. Achieving success requires taking risks."

"We are thrilled that Rashmika will be the guest at the 'Gam Gam Ganesha' pre-release event. Kedar, who produced this film with me, is my friend. We are currently finalizing two more stories and plan to start filming them within the next two to three months. If I ever get the opportunity to work with my favorite actor Balakrishna, it would be a blessing. Several movies are releasing this week alongside ours, and we view this as healthy competition."

"గం..గం..గణేశా" మంచి యాక్షన్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత వంశీ కారుమంచి

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన "గం..గం..గణేశా" సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నిర్మాత వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించిన "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, నిర్మాతగా తన అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత వంశీ కారుమంచి.

  • మాది గుంటూరు. యూఎస్ వెళ్లి జాబ్స్, బిజినెస్ చేశాం. లాక్ డౌన్ టైమ్ లో ఇండియాకు వచ్చాము. లాక్ డౌన్ వల్ల యూఎస్ వెళ్లలేకపోయా. చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్లడం అలవాటు. బాలకృష్ణ అభిమానిని. అమెరికా వెళ్లాక కూడా అక్కడ మన తెలుగు సినిమాలన్నీ చూసేవాళ్లం. మేము పేపర్స్ విసిరేస్తూ థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేయడం అక్కడి వాళ్లకు కొత్తగా అనిపించేది. యూఎస్ లో ఇంకొన్నేళ్లు ఉండి ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలని అనుకున్నాం. అప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ ఉండేది. అయితే లాక్ డౌన్ లో ఇక్కడే ఆగిపోవడం వల్ల ఆనంద్ తో సినిమా బిగిన్ చేశాం. ఆనంద్, విజయ్ నాకు మంచి మిత్రులు.

  • దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ కథ చెప్పినప్పుడు ఆనంద్ కు బాగుంటుంది అనిపించింది. అయితే ఆనంద్ ఇలాంటి కథ చేస్తాడా లేదా అనే సందేహం ఉండేది. కథ విన్నాక ఆనంద్ కూడా తనకు కొత్తగా ఉంటుందని భావించి మూవీకి ఓకే చెప్పాడు. ఆనంద్ ఈ సినిమాలో ఫంకీ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర ఇది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా గం గం గణేశా. వినాయక చవితికే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా..అప్పుడు కొన్ని స్ట్రైక్స్ జరగడం, ఆనంద్ బేబి మూవీ మేకోవర్ లో ఉండిపోవడంతో గం గం గణేశాను పోస్ట్ పోన్ చేశాం. ఈ నెల 25న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా..ఆ రోజు దిల్ రాజు గారి లవ్ మీ రిలీజ్ చేశారు. సో 31 డేట్ మా మూవీ రిలీజ్ కు పర్పెక్ట్ అనుకుంటున్నాం.

  • గం గం గణేశా సినిమా నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 400కు పైగా థియేటర్స్ దొరికాయి. నెంబర్ పరంగా మంచి రిలీజ్ అని భావిస్తున్నాం. అమోజాన్ ప్రైమ్ తో ఓటీటీ డీల్ చేసుకున్నాం.

  • గం గం గణేశా సినిమా ఆనంద్ కు కొత్తగా ఉంటుంది. ఆయన బేబి సినిమాతో దీన్ని పోల్చవద్దు. అది లవ్ ఎమోషనల్ మూవీ. ఇది క్రైమ్ కామెడీ యాక్షన్ సినిమా. ముఖ్యంగా కామెడీ ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో జనరేట్ అయ్యే కామెడీ మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నవ్విస్తాడు. ఇద్దరు హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి పర్ ఫార్మెన్స్ చేశారు. వీళ్లిద్దరి పాత్రలకు స్కోప్ ఉంటుంది. బేబి సినిమా సక్సెస్ తర్వాత మేమీ సినిమాను రిలీజ్ కు తీసుకురావడం అడ్వాంటేజ్ అయ్యింది.

  • క్రైమ్ కామెడీ జానర్ లో కథలు చెప్పినంత బాగా దర్శకులు తీయలేరు. కానీ గం గం గణేశాను కథ నెరేషన్ కంటే బాగా తెరకెక్కించాడు ఉదయ్. కొంత బడ్జెట్ ఎక్కువైంది. అయితే సినిమాలో ఆ క్వాలిటీ తెలుస్తుంటుంది. మా సర్కిల్ లో సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెప్పారు.

  • ఇతర ఇండస్ట్రీస్ తో పోల్చితే సినిమా ఇండస్ట్రీ క్లిష్టమైంది. చూసేందుకు చిన్న ఇండస్ట్రీ అయినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఐటీ సెక్టార్ లో కనీసం 15 పర్సెంట్ వర్క్ సినిమా ఇండస్ట్రీ నుంచే వస్తోంది. ఏ బిజినెస్ అయినా రిస్క్ చేయాల్సిందే. లైఫ్ లో రిస్క్ లేనిదే ఏదీ సాధించలేదు. సినిమా ప్రొడక్షన్ లోనూ రిస్క్ ఉంది.

  • గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రశ్మిక అతిథిగా రావడం సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన కేదార్ నాకు స్నేహితుడు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో ఆ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. నా అభిమాన నటుడు బాలకృష్ణతో సినిమా నిర్మించే అవకాశం వస్తే అదొక వరంలా భావిస్తా. ఈ వారం మాతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలకు వస్తున్నాయి. కాంపిటేషన్ ఉంది. అయితే అది హెల్దీ కాంపిటేషన్ గానే భావిస్తున్నాం.

Gam Gam Ganesha is good action comedy entertainer that will impress audience big time - Producer Vamsi Karumanchi

Facebook Comments
Gam Gam Ganesha is good action comedy entertainer that will impress audience big time - Producer Vamsi Karumanchi

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.