Social News XYZ     

A film that parents should show their children.. ‘Preminchoddu’ – Team at the teaser launch event

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం.. ‘ప్రేమించొద్దు’ - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు..అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం నాడు మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. ‘నేను సినిమాను చూశాను. శిరీన్ ఏడ్పించేశాడు. ఆయన సినిమాను తీయలేదు.. ఎమోషన్‌ను తీశాడు. స్టార్టింగ్‌లో ఓ తమిళ్ సినిమాలా అనిపించింది. తెలుగులో ఆ తమిళ్ ఫ్లేవర్‌ను నేచురల్‌గా తీశాడు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది. కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారు. అనురూప్ అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్క ఫీమేల్ కారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమాను అందరూ చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీ నచ్చుతుంది. మన జీవితాల్లోంచే ఈ పాత్రలు వచ్చినట్టుగా కనిపిస్తాయి. మూడు గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చూపించేదే కాదు.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే చిత్రంగా ఉంటుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జూన్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

 

దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కించాం. ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ ఫిల్మ్‌ అనేలా ఉందని ప్రశంసించారు. నాకు ఎంతగానో సహకరించిన టీంకు థాంక్స్. మా టీం అంతా తెరపై కనిపించనట్టుగా ఉండరు. చాలా కామ్‌గా ఉంటారు. మా సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో అనురూప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బంధూక్, శేఖరం గారి అబ్బాయి అనే సినిమాలు చేశాను. నాకు ఇది మూడో చిత్రం. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశాం. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లలకు దగ్గరుండి మరీ చూపించే సినిమా అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందరూ ఆదరించాలి. శిరీన్ అన్న ఇంతకు ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మూడేళ్లు కష్టపడి ఆయన ఈ మూవీని తీశారు. ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నటి సంతోషి మాట్లాడుతూ.. ‘మూవీ చాలా బాగా వచ్చింది. నాకు మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. హీరో, దర్శక నిర్మాతలు ఎంతో సహకరించారు’ అని అన్నారు.

నటి సోనాలి గర్జె మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్‌గా నటించడమే కాకుండా దర్శకత్వ శాఖలో పని చేశాను. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మూవీ ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

నటి మానస మాట్లాడుతూ.. ‘షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నాకు ఈ చిత్రంలో మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. మెచ్యూర్డ్ అమ్మాయి, కష్టాల్లో తోడు ఉండే స్నేహితురాలి పాత్రలో కనిపిస్తాను. మా చిత్రం జూన్ 7న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నటీనటులు:

అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు

సాంకేతిక వర్గం:

రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ - మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ - అనూప్ చౌదరి, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌: నిఖిలేష్ తొగ‌రి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

A film that parents should show their children.. 'Preminchoddu' - Team at the teaser launch event

Facebook Comments
A film that parents should show their children.. 'Preminchoddu' - Team at the teaser launch event

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.