Social News XYZ     

On the occasion of Sai Pallavi’s birthday, a special poster is released from ‘Tandel’ – Sai Pallavi, who shone with million dollar smiles, the team of ‘Tandel’ will release a special birthday video tomorrow.

సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా 'తండేల్' నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల- మిలియన్ డాలర్ల స్మైల్స్ తో మెరిసిన సాయిపల్లవి, రేపు బర్త్ డే స్పెషల్ వీడియో విడుదల చేయనున్న'తండేల్' టీమ్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జాతీయ అంశాలతో కూడిన బ్యూటీఫుల్ రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రేపు సాయి పల్లవి పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా వండర్ ఫుల్ ఎలిగెన్స్ తో కనిపించారు. మిలియన్ డాలర్ల స్మైల్స్ తో ఆకట్టుకున్నారు. పోస్టర్ లో ఆమె ఫోన్ మాట్లుతున్నట్లు కనిపిస్తున్నారు. రేపు ఉదయం 9:09 గంటలకు సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్ వీడియో విడుదల చేయనున్నారు 'తండేల్' టీమ్.

 

టీజర్ విడుదలైన తర్వాత 'తండేల్' పై హ్యుజ్ బజ్‌ క్రియేట్ అయ్యింది. ఇందులో నాగ చైతన్య జాలరి పాత్రలో నటిస్తున్నారు. క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Facebook Comments
On the occasion of Sai Pallavi's birthday, a special poster is released from 'Tandel' - Sai Pallavi, who shone with million dollar smiles, the team of 'Tandel' will release a special birthday video tomorrow.

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.