Social News XYZ     

Director VN aditya, chandrabose, Rp patnaik Graced the 21st anniversary event of suswara music academy, dallas, USA

వీఎన్ ఆదిత్య, చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా డల్లాస్ లో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాలు

అమెరికాలోని డల్లాస్ నగరంలో సుస్వర మ్యూజిక్ అకాడెమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ మీనాక్షి అనిపిండి. ఈ అకాడెమీ 21వ వార్షికోత్సవం ఆదివారం (మే 5న) ఘనంగా నిర్వహించారు. గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ నగరంలోని ప్రముఖులతో సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా పాల్గొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు శ్రీ గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల, శ్రీమతి శారద సింగిరెడ్డి, శ్రీ ప్రకాష్ రావు అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య‌తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.

సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ అలరించింది.ఈ వేదికపై చంద్రబోస్ కు "సుస్వర సాహిత్య కళానిధి", ఆర్పీ పట్నాయక్ కు "సుస్వర నాద‌నిధి" అనే బిరుదులు అందించారు. కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

 

Director VN aditya, chandrabose, Rp patnaik Graced the 21st anniversary event of suswara music academy, dallas, USA

Facebook Comments
Director VN aditya, chandrabose, Rp patnaik Graced the 21st anniversary event of suswara music academy, dallas, USA

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.