Social News XYZ     

This is my daridram song from ‘Raju Yadav’ launched by Hero Sudigali Sudheer

హీరో సుడిగాలి సుధీర్ లాంచ్ చేసిన గెటప్‌ శ్రీను, కృష్ణమాచారి.కె , సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ 'రాజు యాదవ్‌' నుంచి థిస్ ఈజ్ మై దరిద్రం సాంగ్

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్ సింగిల్-రాజు యాదవ్ చూడు కు పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'థిస్ ఈజ్ మై దరిద్రం' సాంగ్ ని హీరో సుడిగాలి సుదీర్ లాంచ్ చేశారు.

 

స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఎనర్జిటిక్ గా ట్యూన్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ హై వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం హీరో క్యారెక్టర్ ని హిలేరియస్ గా ప్రజెంట్ చేసింది. ఈ పాటలో హీరోకి ఎదురయ్యే సిట్యువేషన్స్ నవ్వులు పంచాయి.

లవ్, కామెడీతో పాటు సినిమాలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా వున్నాయి.

రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్
గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి
కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్
పీఆర్వో: వంశీ - శేఖర్
సోషల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Facebook Comments
This is my daridram song from 'Raju Yadav' launched by Hero Sudigali Sudheer

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.