Social News XYZ     

‘Prasanna Vadanam’ is very good. Go to the theater on May 3 and watch the movie. Film will surely entertain you: Star director Sukumar at trailer launch & prerelease event

‘ప్రసన్న వదనం’ సినిమా చాలా బావుంది. మే3న థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది: ట్రైలర్ లాంచ్ & ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ సుకుమార్

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..‘‘సుహాస్‌.. అంటే నాకు, బన్నీకి చాలా ఇష్టం. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్ కేశవగా ముందు సుహాస్ ని అనుకున్నాం. కానీ, అప్పటికే సుహాస్ హీరోగా చేయడంతో ఆ రోల్‌కి ఎంపిక చేయడం బాగోదనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్‌.. ఫ్యూచర్‌ నానిలా అనిపిస్తున్నాడు. నాని సహజ నటుడు కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో. అంత ఆర్గానిక్ గా వుంది. తన నటన చూస్తున్నాను. ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడు. ఇందులో రాశీసింగ్‌, పాయల్‌ రాధాకృష్ణ చక్కగా నటించారు. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా అర్జున్ కి సినిమా ఇచ్చిన నిర్మాతలు ధన్యవాదాలు. నేను ‘జగడం’ సినిమా రూపొందిస్తున్న సమయంలో అర్జున్‌ కలిశాడు. ‘మీ ‘ఆర్య’ చిత్రం నాకు బాగా నచ్చింది సర్‌. మీ వద్ద పని చేయాలనుకుంటున్నా’ అని అన్నాడు. టీమ్‌లో జాయిన్‌ చేసుకున్నా. అర్జున్ చాలా అమాయకుడు. కానీ, బోలెడు లాజిక్‌ ఉన్నవాడు. అర్జున్‌, మరో అసిస్టెంట్‌ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్‌’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. వీళ్లతోపాటు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరు యాడ్‌ అవుతూ ఉండేవారు. అర్జున్ కి ఏదైనా సమస్య చెబితే పరిష్కారం సెకన్స్ లో చెబుతాడు. నిజానికి తను హాలీవుడ్ లో వుండివుంటే మరో స్థాయి సినిమా తీసేవాడు. అంత లాజిక్ వున్నవాడు. అర్జున్‌ బిజీగా ఉండడంతో నేను లాజిక్‌ ఉన్న సినిమాలను మానేశా. అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆ లాజిక్ తోనే ప్రసన్న వదనం తీసాడు. తను చాలా నిజాయితీ పరుడు. ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశాడు. తన ప్రేమ, నిజాయితీ చాలా ఇష్టం. ఈ సినిమా చూశాను. చాలా బావుంది. ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను. అంత చక్కగా తీశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. నా అర్జున్‌ని సపోర్ట్‌ చేయండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది' అన్నారు.

 

హీరో సుహాస్ మాట్లాడుతూ.. 'ప్రసన్న వదనం' మే 3న విడుదలౌతోంది. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని అలరించాయి. ప్రసన్న వదనం కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రేక్షకులు థియేటర్స్ దాక వస్తే చాలు.. అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అర్జున్ చాలా కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలు చాలా పాషన్ తో సినిమాని నిర్మించారు. పాయల్, రాశి చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సుకుమార్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ గారికి వాళ్ళ టీం అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమిస్తారు. మా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు' తెలిపారు.

దర్శకుడు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. మేమంతా దర్శకులిగా వచ్చాం అంటే కారణం సుకుమార్ గారు. ఆయన నుంచి ఇంకా చాలా మంది దర్శకులు వస్తారు. సుహాస్ ప్రతి సారి కొత్త కంటెంట్ తో వస్తారు. అర్జున్, సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తునప్పటినుంచి తెలుసు. అర్జున్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అర్జున్ అన్న చాలా కష్టపడ్డారు. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు.ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ.. సుకుమార్ గారి విరూపాక్ష కథ చెప్పినపుడు అర్జున్ కి చెప్పు ఇన్ పుట్స్ ఇస్తాడని అన్నారు. అర్జున్ కథ చెప్పిన తర్వాత చాలా విలువైన సలహాలు ఇచ్చారు. నా విజయంలో ఆయన వున్నారు. ఈ సినిమా కథ తెలుసు. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. కొత్త దర్శకులకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' చెప్పారు.

నటుడు, దర్శకుడు శ్రీనివాస అవసరాల మాట్లాడుతూ.. అర్జున్ తో కలసి ఓ షార్ట్ ఫిలిం చేశాను. అర్జున్ దర్శకుడు అవుతాడని చాలా ఎదురుచూశాను. ఇప్పుడు అర్జున్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. సుకుమార్ గారి దగ్గర పని చేయడం అదృష్టం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సుహాస్ గారు ప్రతి సినిమాకి ఎదుగుతున్నారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బావుంది. సుహాస్ గారు ప్రతి సినిమాకి ఎదుగుతున్నారు. ఈ ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాత మణిగారి ఈ సినిమా పెద్ద విజయం సాధించి పెట్టాలని కోరుకుంటున్నాను. అర్జున్ రూమ్ పక్కనే మా రూమ్ వుండేది. ఆయన సుకుమార్ గారి దగ్గర పని చేశావారని తెలిసి మా ఆనందాని హద్దులు లేవు. ఒకసారి ఆర్య 2 షూటింగ్ కి కూడా తీసుకెళ్ళారు. ఆ క్షణం మర్చిపోలేం. సుకుమార్ గారి అర్జున్ పై చాలా నమ్మకం. నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక ఫైట్ ని షూట్ చేసే అవకాశం అర్జున్ కి ఇచ్చారని విన్నాను. ఆలాంటి అర్జున్ ఈ సినిమాని చాలా అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని నమ్ముతున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు

చిత్ర దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. సినిమాని అనుకున్నదాని కంటే చాలా గ్రాండ్ గా చేశాం. నిర్మాతలు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సుహాస్ దర్శకుల నటుడు. ఈజీగా పాత్రలోకి వెళ్ళిపోతారు. దర్శకుడి మనసులో ఏముందో తనకి తెలిసిపోతుంది. శ్రీనివాస్ అవసరాల గారి ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ అనుభవం చాలా పనికొచ్చింది. బుచ్చి, కార్తిక్, ప్రసన్న ఈ వేడుకకు రావడం అనందంగా వుంది. విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్ టీం చాలా సపోర్ట్ చేసింది. రాశి, పాయల్ చక్కగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సుకుమార్ గారి దగ్గర నుంచి నా జర్నీ మొదలైయింది. ఆయన దగ్గర ల్యాండ్ అవ్వడంతో మొదట నుంచి ఆయన స్థాయిలో ఆలోచించడం మొదలుపెడతాం. ఆయన ఇచ్చిన జ్ఞానం, చనువు మర్చిపోలేను. ఈ సినిమా చూసి ‘శెబాష్’ అన్నారు. అదొక్కటి చాలు నాకు. ఈ సినిమాని పంపిణీ చేస్తున్న మైత్రీ మూవీస్, హంబలే సంస్థలకు ధన్యవాదాలు. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో వస్తున్నాం. చాలా అద్భుతంగా వచ్చింది. అందరం హ్యాపీగా వున్నాం. ప్రేక్షకులు ఖహ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మే3న తప్పకుండా చూడండి' అన్నారు,

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్. కథ వినగానే వర్క్ అవుట్ అవుతుందనిపించింది. దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నా పాత్ర కొత్తగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు. సుహాస్ గారు చాలా నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి' అన్నారు

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుహాస్ , అర్జున్, రాశి ఇలా మంచి టీంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అన్నారు.

నిర్మాత మణికంఠ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా వందశాతం బ్లాక్ బస్టర్. కలర్ ఫోటో తో నా జర్నీ మొదలైయింది. సుహాస్ కెరీర్ లో నా పేరు ఖచ్చితంగా ఓ పేజీ లో వుంటుంది. మా స్నేహం అలానే వుండాలని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు, ప్రసన్న, అవసరాల శ్రీనివాస్, కార్తిక్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. మొదట ఈ కథ అరవింద్ గారు విని చేద్దామనుకున్నారు. రవికాంత్, శ్రీనివాస్, మై హోం రామ్ గారికి ధన్యవాదాలు. రాజేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా డిస్ట్రిబ్యుటర్స్ మైత్రీ, హంబలే ఫిలిమ్స్ కి ధన్యవాదాలు. దర్శకుడు అర్జున్ అద్భుతంగా తీశాడు. మే3న సినిమా ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా బావుటుంది' అన్నారు.

నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సుహాస్ గారితో జర్నీ చాలా బావుంది. రాశి, పాయల్ చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.టీం అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మే3న సినిమా విదుదలౌతుంది. తప్పకుండా చూడండి' అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.

'Prasanna Vadanam' is very good. Go to the theater on May 3 and watch the movie. Film will surely entertain you: Star director Sukumar at trailer launch & prerelease event

Facebook Comments
'Prasanna Vadanam' is very good. Go to the theater on May 3 and watch the movie. Film will surely entertain you: Star director Sukumar at trailer launch & prerelease event

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.