Social News XYZ     

Maya Pettika Movie Review: A Fun Ride (Rating: 3.25)

వైవిధ్యమైన కథ, స్క్రీన్ ప్లేతో ఓ సరికొత్త మూవీని సెల్యులాయిడ్ పై ఆవిష్కరిస్తే... ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి... నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి. అలాంటి వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిందే సెల్ ఫోన్ బయోపిక్ గా తెరకెక్కిన ‘మాయా పేటిక’. ఇప్పటి వరకు మరం మనుషుల బయోపిక్ చూసుంటాం. కానీ... ఈ ఆధునిక యుగంలో ఏడాది వయసున్న పసిపిల్లల నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ అడిక్ట్ అవుతున్న ఒకే ఒక డివైజ్ సెల్ ఫోన్. అలాంటి సెల్ ఫోన్ వివిధ రకాల మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది... వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేదే ఈ స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ మూవీ.

ఈ చిత్ర కథ విషయానికొస్తే... ప్రణయ్(ర‌జ‌త్ రాఘ‌వ్), పాయల్(పాయల్ రాజ్ పుత్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే పాయల్ కు హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉంటుంది. అందుకు ప్రణయ్ కూడా ఒకే చెప్పి... ఆమెను ఎంకరేజ్ చేస్తాడు. అయతే ఆమెకు ఓ సినిమా నిర్మాత సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. చాలా పొసెసివ్ గా ఉండే ప్రణయ్... దానిని భరించలేడు. ఒకానొక సందర్భంలో ఆ సెల్ ఫోన్ వల్ల వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, పెళ్లి బ్రేకప్ దాకా వెళుతుంది. మరి పాయల్ ఆ సెల్ ఫోన్ ని వదిలించుకుందా? మళ్లీ వారిద్దరూ కలిశారా? పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే ఈ సెల్ ఫోన్... కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ) జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది. కార్ వాష్ చేసే ఆలీ(విరాజ్ అశ్విన్), అస్రాని(సిమ్రత్ కౌర్) ప్రేమజంట ఎలా ఒకటైంది. వాచ్ మెన్ నారాయణ(సునీల్)... నెక్లెస్ గొలుసు నారాయణగా ఎలా ఫేమస్ అయ్యాడు? వారి జీవితంలో నింపిన వెలుగులు ఏమిటి? పేదరికాన్ని భరించలేక హిజ్రా వేషంలో చిల్లర చిల్లర దొంగతనాలు చేసే శీను(కమెడియన్ శ్రీనివాస రెడ్డి) క్యాబ్ డ్రైవర్ గా మారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుకున్నాడు? పాకిస్థాన్ లోని ఉగ్రవాదువులను ఎలా తుద ముట్టించింది అనేది తెరమీద చూడాల్సందే.

దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఇంపార్టెన్స్ చాలా కీ రోల్ పోషిస్తోంది అనడంలో సందేహం లేదు. తెల్లారింది మొదలు... డిడ్ నైట్ దాకా ఈ సెల్ ఫోన్... మనిషి జీవితంలో పోషించే పాత్రను ఒక విధంగా వెలకట్టలేం. అలాంటి సెల్ ఫోన్ ను మంచికి ఉపయోగిస్తే... అది మన జీవితానికి ఎంత ఎపయోగపడుతుంది? అలాగే చెడుకు ఉపయోగిస్తే... మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దాన్ని ఇందులో దర్శకుడు చాలా చక్కగా నెరేట్ చేశాడు. నిజాయతీ గల ఇద్దరు ప్రేమికుల మధ్య సెల్ ఫోన్ ఎలాంటి చిచ్చు రేపింది అనేది చాలా సున్నితంగా చూపించారు. అలాగే కన్నే కామేశ్వరరావు పాత్రతో... సెల్ ఫోన్ దుర్వినియోగం ఎలా అయింది అనేది చూపించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంతో చాలా పాపులర్ అయ్యారు. ఆ ప్రోగ్రాం ఇన్సిపిరేషన్ తో ఇందులో కూడా గుడ్ నైట్ అనే ప్రోగ్రాంతో చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. అలాగే అంబటి రాంబాబు కొంత మంది మహిళలతో ఆ మధ్య సెల్ ఫోన్లో మాట్లాడిన సంభాషణలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి సీన్ ను కూడా ఇందులో చూపించారు. అలాగే పృథ్వీ కూడా తనను తానే ఇమిటేట్ చేసుకునే సీన్ కూడా చాలా నిజాయతీగా ఒప్పుకుని చేశాడు. ఈ పాత్ర ప్రేక్షకులన్ని బాగా నవ్విస్తుంది. ఇదే ఎపిసోడ్ లో మేయర్ గా నటించిన హిమజ కూడా పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. నక్కిలీసు గొలుసు నారాయణ పాత్రలో సునీల్, అతనికి జంటగా నటించిన శ్యామల పాత్రలు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. పేదరికంలో మగ్గే ఈ జంటగా జీవితంలో ఓ స్మార్ట్ ఫోన్ వచ్చి... వారిని ఓవర్ నైట్ లో యూట్యూబ్ స్టార్స్ ని ఎలా మార్చేసింది... రీల్స్ రూపంలో వారికి ఆర్థిక పరిపుస్ఠిని ఎలా సంపాధించి పెట్టిందనేది చూపించారు. ఆ తరువాత వచ్చే విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ పేయిర్ కూడా యూత్ ని ఆకట్టుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు ఎలాంటి డిజేబుల్ అడ్డురాదని చెప్పే పాత్ర ఇది. చాలా హృద్యంగా తెరకెక్కించారు. అలాగే పొట్ట పోషించుకోవడం కోసం ఓ పేదవాడు ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధపడే పాత్రలో శ్రీనివాస రెడ్డి పాత్రను చూపించి... అది సరైన మార్గం కాదని... జీవించడానికి ఎన్నో మార్గాలున్నాయని చూపించే పాత్రను బాగా పోర్ట్ రైట్ చేశాడు దర్శకుడు. అది ఒక రకంగా మెసేజ్ కూడా ఇస్తుంది. అలాగే చివర్లో టెర్రరిజం కోసం సెల్ ఫోన్ ఎలా ఉపయోగపడుతుందనే దాన్ని చూపించారు. ఒక క్రైం చేయడానికి సెల్ ఫోన్ ఎలా దుర్వినియోగం అవుతుందనే దానిని చూపించారు. ఇలా ఒక మొబైల్ నిత్య జీవితంలో ఎన్ని రకాల పాత్రను పోషిస్తుందనే దానిని దర్శకుడు రమేష్ రాపర్తి చాలా స్టడీ చేసి తెరమీదకు తెచ్చారు. కథ... కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రేక్షకులు సరదాగా చూసెయ్యెచ్చు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా చాలా క్వాలిటీగా సంయుక్తంగా నిర్మించారు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్..!!!

 

రేటింగ్: 3.25

Maya Pettika Movie Review: A Fun Ride (Rating: 3.25)

Facebook Comments
Maya Pettika Movie Review: A Fun Ride (Rating: 3.25)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: