Social News XYZ     

Thallada Sai Krishna Felicitated Lyric Writer Chandrabose in his hometown

ఆస్కార్ అవార్డు పొందడం మన తెలుగు పరిశ్రమ కే గర్వకారణం - సినీ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ

ఆదివారం నాడు చంద్రబోస్ స్వస్థలం ఐన చల్లగరిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ తరపున నమస్తే సేట్ జీ హీరో డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ, హీరోయిన్ స్వప్న చౌదరి లు చంద్రబోస్ కి సన్మానం చేసి సత్కరించారు.

ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ
నాటు నాటు పాట ద్వారా యావత్ ప్రపంచానికి మన తెలుగు పాటని అందరూ మెప్పించేలా , చివరకు ఆస్కార్ అవార్డు సైతం మన తెలుగింటి వాకిట్లో కి వచ్చేలా చేసిన చంద్రబోస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, చంద్రబోస్ గారి సాహిత్యం అంటే చాలా ఇష్టం,ఎన్నో కష్టాలు పడి ఇలా ఉన్నత స్థాయికి చేరుకున్న చంద్రబోస్ గారు మా లాంటి ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ కి స్పూర్తిదాయకం, అలాంటి చంద్రబోస్ గారిని మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని సినీ హీరో డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ అన్నారు.

 

ఈ సందర్భంగా హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ
చిన్నప్పటి నుండి బోస్ గారు రాసిన పాటలు వింటూ ఎదిగాను. సార్ కి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి మణికంఠ, సతీష్, ప్రసాద్ , జేడీ లు పాల్గొన్నారు.

Facebook Comments
Thallada Sai Krishna Felicitated Lyric Writer Chandrabose in his hometown

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: