30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా "కొత్త రంగుల ప్రపంచం" గ్లిమ్ప్స్ విడుదల
ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా "కొత్త రంగుల ప్రపంచం"
పృద్విరాజ్ ,క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు చిత్రబృందం.
ఈ సందర్భంగా30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి మాట్లాడుతూ...
ఈ సినిమా చాలాబాగా వచ్చింది. ఒక సీన్ ను మొదలుపెట్టేముందు డీఓపీ తో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమాకి సినీ ప్రముఖులు నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు.
హీరో క్రాంతి కృష్ణ మాట్లాడుతూ..
నేను ముందుకు పృథ్వి రాజ్ కి థాంక్స్ చెప్పాలి. నేను ఆయనను గురూజీ అని పిలుస్తాను. టెక్నీషియన్స్ అందరు 100% వర్క్ చేసారు ఈ సినిమా కోసం. ఇది నా మొదటి సినిమా నిర్మాతలు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్. సీనియర్ నటులతో నేను సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ...
ఈ సినిమా కోసం అందరు వాళ్ళ 100% బెస్ట్ ఇచ్చారు. మా నాన్న దర్శకత్వంలో నేను ఈ సినిమా చెయ్యడం లక్కీ ఫీల్ అవుతున్నాను.
నటీనటులు
పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ (హీరో), శ్రీలు (హీరోయిన్),
విజయ రంగ రాజు, అశోక్ కుమార్, అంబటి శ్రీను, గీతాసింగ్, కృష్ణ తేజ, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :శ్రీ పి ఆర్ క్రియేషన్స్
నిర్మాత : పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి,కుర్రి కృష్ణా రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ సంగీత ఆదిత్య
కెమెరామెన్ :Sv శివారెడ్డి
డాన్స్ : వల్లమ కళాధర్ , సత్యం , మధు సుధన్
పి.ఆర్.ఓ : గణేష్ , ధీరజ్
డిజిటల్ : ప్రసాద్ లింగం
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.