Social News XYZ     

Sekhar master appreciated Love Reddy team

లవ్ రెడ్డి యూనిట్ కు శేఖర్ మాస్టర్ ప్రశంశలు !!!

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సునంద బి.రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ...
లవ్ రెడ్డి గ్లిమ్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇది చూశాక నచ్చి ఈ చిత్ర యూనిట్ ను పిలిపించి మాట్లాడడం జరిగింది. అందరూ కొత్తవాళ్ళు చేస్తున్న ఈ సినిమా సాంగ్స్ చూశాను, సంగీతం బాగుంది. ఈ సినిమాను నేను థియేటర్స్ లో చూడ్డానికి వేచి చూస్తున్నాను. లవ్ రెడ్డి చిత్ర యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అన్నారు.

 

డైరెక్టర్ స్మరన్ మాట్లాడుతూ...
ఆంధ్ర, కర్ణాటక బాడర్ లో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ లవ్ రెడ్డి. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది. త్వరలో టీజర్ ట్రైలర్ విడుదల చెయ్యబోతున్నాము. మా సినిమాకు సపోర్ట్ చేసున్న ఆడియన్స్ కు ధన్యవాదాలు. గ్లిమ్స్ కు మంచి స్పందన లభిస్తోంది. శేఖర్ మాస్టర్ మా వర్క్ నచ్చి అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు.

హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ...
లవ్ రెడ్డి టైటిల్ లోగోను నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు, గ్లిమ్స్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మగారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా లవ్ రెడ్డి సినిమా గ్లిమ్స్ నచ్చి శేఖర్ మాస్టర్ మమ్మల్ని పిలిపించి, మాతో సినిమా విశేషాలు తెలుసుకొని మా యూనిట్ మొత్తాన్ని అభినందించడం సంతోషంగా ఉంది. దర్శకుడు స్మరన్ కథను నడిపిన విధానం బాగుంది. ఫిబ్రవరి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.

హీరో: అంజన్ రామచంద్ర
హీరోయిన్: శ్రావణి రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి
నిర్మాతలు: సునంద బి.రెడ్డి,
మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి

సహా నిర్మాతలు: హేమలత రెడ్డి, నాగరాజు బీరప్ప, నవీన్ రెడ్డి, సుష్మిత రెడ్డి, హరీష్, బాబు, రవికిరణ్, జకరియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవీంద్ర రెడ్డి
సంగీతం: ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
పీఆర్ఒ: శ్రీధర్

https://youtu.be/HtDOLEntTgY

Sekhar master appreciated Love Reddy team

Facebook Comments
Sekhar master appreciated Love Reddy team

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: