Social News XYZ     

Siya Goutam’s “Maro Mahabharatam” movie launched

శియా గౌతమ్ మరో మహాభారతం ప్రారంభం !!!

"ప్రతి గంటకు నేల రాలే చిగురాకుల కలలెక్కడ?
ప్రతి కంటికి నేల జారే కన్నీటికి కళలెక్కడ?

లయ తప్పని విలయమైనా...
ప్రళయమైనా ...
లోక రక్షణే కదా !!

 

ఇది మరల రాయని భారతమైనా
మరో మహా భారతమే కదా" !!

ఎస్ఎస్ క్రియేషన్స్ నిర్మాణంలో ఎమ్ఎస్ రెడ్డి సమర్పణలో జగదీష్ దూగాన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మరో మహాభారతం. శియా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ లేడి ఒరియంటెడ్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. హీరో ఆకాష్ పూరి ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టడం జరిగింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ దూగాన మాట్లాడుతూ...
ఇది చాలా ప్రేత్యేకమైన సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. శియా గౌతమ్ ఈ కథకు కరెక్ట్ గా సెట్ అవుతారని ఆమెను తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ...
మరో మహాభారతం టైటిల్ బాగుంది. మంచి కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, డైరెక్టర్ జగదీష్ దూగాన గారికి ఇది మంచి సినిమా అవ్వాలి అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

Facebook Comments
Siya Goutam's "Maro Mahabharatam" movie launched

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.