Social News XYZ     

First Day First Show movie to release on September 2nd

శ్రీజ ఎంటర్టైన్మెంట్స్- మిత్ర వింద మూవీస్- 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న చిత్రంఫస్ట్ డే ఫస్ట్ షో. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది. సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆసక్తికరంగా వుంది. థియేటర్లో ఫ్యాన్స్ కోలాహలం, విజిల్స్, చప్పట్లు, తెరపై ఫ్యాన్స్ కురిపించిన కాగితాల వర్షం లాంటి సందడి వాతావరణంతో విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంది.

 

ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. టీజర్ తో పాటు మజ్జా మజ్జా, నీ నవ్వే పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు.

తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా

సాంకేతిక విభాగం
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
పీఆర్వో : వంశీ-శేఖర్

Facebook Comments
First Day First Show movie to release on September 2nd

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: