Social News XYZ     

We put together eight amazing sets for ‘ Sarkaru Vaari Paata ‘ .. Cinema will be a Visual Treat : Interview with Art Director AS Prakash

Superstar Mahesh Babu's ambitious film 'Sarkaru Vari Paata' is getting ready for release. Directed by blockbuster director Parasuram, the film is all set to release worldwide on May 12. Star Art Director AS Prakash, who recently worked on Sarileru Neekevvaru was the at director for Sarkaru Vaari Paata as well. Here are some highlights of his interaction with the media.

What was your first feeling after director Parasuram narrated this story?
When Parashuram first narrated me the story, it seemed like a perfect commercial entertainer. I just told the director that it would be a big action, entertainer and then started working.

How was your work experience with Mahesh Babu?
This is my seventh movie with Mahesh Babu. The atmosphere on the sets used to be healthy and enjoyable. At the same time, the output from the technicians is also excellent. We discussed the songs and action sequences and ensured best output. Mahesh Babu's performance in the movie is next level. If he dances on the set, it will be like a visual treat.

 

What kind of encouragement did the producers offer?
Cinema is a passion for the producers of Mythri Movie Makers. They produced the movie without compromising anywhere. They did not compromise to provide what the story needs.

Heard there is a big bank set erected for this film. What is so special about this set?
The story of 'Sakaru Vaari Paata' is set against the backdrop of the bank system. The story required three banks. One of them is of fifty years old. We studied and designed the set in a vintage look in Annapurna studios. It comes in flashback. We also laid two other modern bank sets.

What is the importance of art direction?
The art director makes an imagination after the director tells the story. Directors come up with a vision. It is accompanied by Art Director Vision. These visions must be captured by the cameraman.

What is the justification for the film's title?
The justification will be find in the story. You will understand it at the beginning of the movie itself.

What about the other sets?
This is a huge movie. We worked for several days. Apart from the bank, almost eight sets were laid. There is also a street set. We first wanted to shoot it in Goa. However, there were some practical problems. Again we took a basic colony in Hyderabad and designed it to fit the story like Vizag Street. Most of the shooting took place on the sets. We have done a lot of interiors and exterior design.

The influence of Pan India movies has increased. Audiences from other industries are also waiting for the films here. Is there any pressure to make the project even grand?
It is not about Pan-India. We have to be careful about what we do. Otherwise, there will be no next project. There can be no pressure other than to think about how much justice should be done to the story and according to the budget.

You have done seven films with Mahesh Babu. Which of these is the best work of art? What's so difficult?
There is no difficulty. We do the same work for every movie. Some films may get a good name. Awards come if there are bigger sets. We did lot of work for Sarkaru Vaari Paata. We did lot of interior and exterior work. We can not find the difference between a set and a real one because they are so natural.

How much did art change since Dookudu?
Dookudu was a big movie back then. Subsequently, the budget increased and so did the material and labor costs. But according to the story, no matter how much the budget increases, the producers provide what they need without compromising.

Your work experience with cameraman Madhie?
This is the third film with Madhie after Mirchi and Run Raja Run. The third one is Sarkaru Vaari Paata. Working with him is a nice experience.

Do our Stars have an understanding of the technical department?
All our stars including Mahesh Babu garu have excellent knowledge. They know very well who works and how. They watch films of all stars and recommend good technicians for their films.

What kind of film you wish to work in the future?
I want to work for socio-fantasy films.

What are your upcoming films?
Chiranjeevi's Bholaa Shankar and director Bobby's film, Balakashna - Malineni Gopichand film, Trivikram - Mahesh Babu, and Venkatesh - Varun Tej - Anil Ravipudi F3 are the forms I'm working for.

'సర్కారు వారి పాట' కోసం ఎనిమిది అద్భుతమైన సెట్స్ వేశాం.. సినిమా విజువల్ ట్రీట్: ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ ఇంటర్వ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట'కు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలివి.

డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ?

పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా.

మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంటుంది ?

మహేష్ బాబు గారితో ఇది7 వ సినిమా. సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలని చర్చిస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయన సెట్ లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్ లా వుంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు ?

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్ గా రావాలని తపన మైత్రీ మూవీ మేకర్స్ లో వుంది.

'సర్కారు వారి పాట' కోసం పెద్ద బ్యాంక్ సెట్ వేశారట కదా.. బ్యాంక్ సెట్ విశేషాలేంటీ ?

'సర్కారు వారి పాట' స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం.

ఒక కథలో ఆర్ట్ విభాగం ఆవశ్యకత ఏమిటి ?

దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాఫ్ లో ఎలా వుంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్ తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడౌతుంది. ఈ విజన్స్ నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి.

సర్కారు వారి పాట టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వగలరా ?

కథలోనే వుంది. సినిమా బిగినింగ్ లోనే మీకు అర్ధమైపోతుంది

బ్యాంకు కాకుండా మరేమైన సెట్స్ వేశారా ?

భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా వుంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబద్ లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్ లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం.

పాన్ ఇండియా సినిమాలు ప్రభావం ఎక్కువైయింది. ఇక్కడి సినిమా కోసం మిగతా పరిశ్రమల ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఇంకా గ్రాండ్ గా వుండలానే ఒత్తిడి ఏమైనా వుంటుందా?

పాన్ ఇండియా అనే కాదు.. మనం చేసేపని వళ్ళుదగ్గర పెట్టి చేయాలి. లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వుండదు. బడ్జెట్ కి తగ్గట్టు కథకు ఎంత వరకూ న్యాయం చేయాలని అలోచించడమే తప్పా ఒత్తిడి ఏమీ వుండదు.

సాంగ్స్ కోసం సెట్స్ వలన విజువల్ ని ఇంకా పొయిటిక్ గా చూపించే అవకాశం వుంటుందా ?

కొన్ని మన ఇమాజినేషన్ కి తగ్గట్టు బయట దొరకవు. మన ఊహకు తగ్గట్టు సెట్ వేస్తే మనం అనుకున్న ఇమాజినేషన్ ని స్క్రీన్ పై ప్రజంట్ చేయగలం. ముఖ్యంగా సాంగ్స్ సెట్స్ మనం ఫీలై చేయాలి తప్పితే నేచురల్ గా దొరకవు. సర్కారు వారి పాట కోసం వేసిన సాంగ్స్ సెట్స్ తెరపై అద్భుతంగా వుంటాయి.

ఏదైనా సెట్ వేయడానికి మీ హోం వర్క్ ఎలా వుంటుంది ?

ముందు సిట్యువేషన్ ని స్టడీ చేస్తాం. ఉదాహరణ ఒక టెంపుల్ సెట్ వేయాలంటే .. అది నార్త్ లేదా సౌతా ? శివాలయమా ? విష్ణు అలయమా ? ఇలా ప్రతిది స్టడీ చేస్తాం. తర్వాత షూటింగ్ డేస్ చూస్తాం. నెల షూటింగ్ అయితే ఒకలా వారం రోజులు షూటింగ్ జరిగితే మరోలా వుంటుంది. కథలో పర్టికులర్ సెట్ ప్రాముఖ్యతని పరిగణలోకి తీసుకుంటాం.

ఒకప్పుడు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కొద్దిమంది టెక్నీషియన్స్ పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆర్ట్ డైరెక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఆర్ట్ విభాగానికి గోల్డెన్ ఏరా అని భావించవచ్చా ?

పేరుతో పాటు ఇప్పుడు పని కూడా పెరిగింది. ఇప్పుడు అందరికీ వరల్డ్ సినిమా తెలుసు. డిఫరెంట్ కంటెంట్ చూస్తున్నారు. అవైర్ నెస్ పెరిగింది. అలాగే ఇప్పుడొస్తున్న టెక్నీషియన్స్ అంతా తమ రిక్వైర్మెంట్ ని స్పష్టంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్ట్ వర్క్ అంత ఈజీ కాదు.

మహేష్ బాబు గారి ఏడు సినిమాలు చేశారు. ఇందులో ది బెస్ట్ ఆర్ట్ వర్క్ ఏమిటి ? అలాగే కష్టమైనది ఏంటి ?

కష్టం అనేది లేదు. ప్రతి సినిమాకి ఒకేలా వర్క్ చేస్తాం. కొన్నిటికి మంచి పేరు రావచ్చు. పెద్ద సెట్స్ వుంటే అవార్డ్స్ వస్తాయి. సర్కారు వారి పాట కోసం చాలా వర్క్ చేశాం. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ ఇలా చాలా డిజైన్ చేశాం. సినిమా చూశాక అసలు ఇది సెట్టా ? అని కనిపెట్టలేరు. అంత నేచురల్ గా వుంటాయి.

దూకుడు` చిత్రానికి ఈ సినిమాకు ఆర్ట్ విష‌యంలో ఎలాంటి తేడా గమనించారు ?

అప్పట్లో దూకుడు పెద్ద సినిమా. త‌ర్వాత‌ర్వాత బ‌డ్జెట్ పెర‌గ‌డంతో పాటు మెటీరియ‌ల్‌, లేబ‌ర్ ఖర్చులు కూడా పెరిగాయి. అయితే క‌థ ప్రకారం ఎంత బడ్జెట్ పెరిగినా నిర్మాతలు రాజీపడకుండా కావాల్సినవి స‌మ‌కూరుస్తుంటారు.

టెక్నాలజీ పెరిగింది కదా.. పని ఒత్తడి తగ్గిందా ?

వర్క్ ఇంకా పెరిగింది. ఇంతకుముందు సెట్ మొత్తం వేసేవాళ్ళం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత సీజీ అంటారు. సిజీ వాళ్ళకి డిజైన్ ఇవ్వాలి. మన వర్క్ ని మనం డిజైన్ చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ వేస్తున్నాం కదా మిగిలన దానికి ఎందుకు ఇంత బడ్జెట్ అని నిర్మాతలతో బడ్జెట్ చర్చలు ..ఇలా వర్క్ ఇంకా పెరుగుతూనే వుంది.

కొన్ని సెట్స్ అని సులువుగా తెలిసిపోతాయి. కానీ కొన్ని తెలీవు. ఒరిజినల్ అనిపించే చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

ముందు బాగా స్టడీ చేయాలి. 'అల వైకుంఠపురంలో ' సినిమా దాదాపు సెట్స్ లో చేశాం. కానీ అది సెట్ అని చాలా మందికి తెలీదు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా అది ఒరిజినలే అనుకున్నారు. అది నేచురల్ లొకేషన్ అనుకోవడం మాకు మైనస్. అయితే ఒరిజినల్ లొకేషన్ అనిపించేలా సెట్ వేశామనే తృప్తి వుంటుంది. అదే అవార్డ్ తో సమానం.

కెమరామెన్ మధిగారితో మీ వర్క్ ఎక్స్ పిరియన్స్ ?

మధి గారితో ఇది మూడో సినిమా. మిర్చి, రన్ రాజా రన్.,.. ఇప్పుడు సర్కారు వారి పాట.. ఆయనతో పని చేయడం నైస్ ఎక్స్పీరియన్స్

బడ్జెట్ కంట్రోల్ చేయడానికి మీ దగ్గర వున్న ఫార్ములా ఏమిటి ?

నేను చేసే బ్యానర్లు చూస్తే మీకే అర్ధమౌతుంది. వాళ్ళు అంతా ప్రొడక్షన్ పై మంచి అవగాహన వున్న వాళ్ళు. ఇంతలో అయితే వర్క్ అవుట్ అవుతుంది. దానికి మించితే ప్రాజెక్ట్ పై భారం పడుతుందని దర్శక, నిర్మాతలతో నేనే ముందే చెప్పేస్తాను.

మన స్టార్స్ కి టెక్నికల్ డిపార్ట్మెంట్ మీద అవగాహన వుంటుందా?

అద్భుతంగా వుంటుంది. ఎవరు ఎలా వర్క్ చేస్తారో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళే టెక్నిషియన్స్ ని రిఫర్ చేసే స్థాయిలో వున్నారు.

కరోనా తర్వాత సెట్ వర్క్ చేసే కల్చర్ పెరిగిందా ?

అవును. కరోనా కారణంగా బయట చేయాల్సిన వర్క్ కూడా సెట్ వేసి చేయాల్సివస్తుంది. దీంతో పనితో పాటు బడ్జెట్ కూడా పెరుగుతుంది.

మీ సినిమాలు కాకుండా ఆర్ట్ విభాగంలో లో మీకు బాగా నచ్చిన సినిమా ?

'బాహుబలి' అనే చెప్తాను. ఆ సినిమా స్కేల్ అలాంటింది.

ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు కూడా విదేశాల‌నుంచి వ‌స్తున్నారు కదా?

ఆర్ట్ డైరెక్టర్లె కాదు కెమరామెన్ తో సహా చాలా మంది టెక్నీషియ‌న్లు విదేశాల‌ నుంచి వచ్చి పని చేస్తున్నారు. ప్రేక్షకులు, నిర్మాతలు తప్పా టెక్నికల్ టీమ్ లో కొందరు ఫారిన్ నుండి వచ్చి పనిచేస్తున్న సందర్భాలు వస్తున్నాయి.

భవిష్యత్ లో ఎలాంటి సెట్స్ వేయాలని కోరుకుంటున్నారు ?

సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలనీ వుంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

చిరంజీవి గారి భోళాశంక‌ర్‌, చిరంజీవి - డైరెక్టర్ బాబీ, బాల‌క‌ష్ణ- మ‌లినేని గోపీచంద్ సినిమా, త్రివిక్రమ్-మహేష్ బాబు, వెంకటేష్ - వరుణ్ తేజ్ - అనిల్ రావిపూడి F3 సినిమాలకి చేస్తున్నా.

Facebook Comments
We put together eight amazing sets for ' Sarkaru Vaari Paata ' .. Cinema will be a Visual Treat : Interview with Art Director AS Prakash

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: