Social News XYZ     

Suhasini Maniratnam’s Focus Movie First Look Unveiled By Star Writer Vijayendra Prasad

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆవిష్క‌రించిన `ఫోక‌స్` చిత్రంలోని సుహాసిని మ‌ణిర‌త్నం లుక్ పోస్ట‌ర్‌.

విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్‌’. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన క‌థ‌-క‌థ‌నాల‌తో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, వేలంటైన్స్‌డే సంద‌ర్భంగా రిలీజైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫోక‌స్ మూవీ నుండి సీనియ‌ర్ న‌టి సుహాసిని మ‌ణిరత్నం స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్ ను స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

 

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - సూర్య‌తేజ త‌న డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై `ఫోక‌స్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్‌శంక‌ర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడే టీజ‌ర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్ర‌లు చాలా ఉన్నాయి. అంద‌రూ ఈ సినిమాని చూసి ఎంక‌రేజ్ చేయండి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ - నేను ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ మొద‌టి చిత్రం `ఫోక‌స్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్ ను ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు క‌థల‌ను అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. భాను చంద‌ర్‌, షియాజీ షిండే, జీవా, సూర్య భ‌గ‌వాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో న‌టించారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

నటీ నటులు: విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి...

సాంకేతిక బృందం
డైరెక్టర్‌: జి. సూర్యతేజ
నిర్మాణం: రిలాక్స్‌ మూవీ మేకర్స్‌
సమర్ఫణ: స్కైరా క్రియేష‌న్స్‌
ఎడిటర్‌: సత్య. జీ
డీఓపీ: జే. ప్రభాకర్‌ రెడ్డి
సంగీతం: వినోద్‌ యజమాన్య
లిరిసిస్ట్: కాస‌ర్ల శ్యాం

Facebook Comments
Suhasini Maniratnam's Focus Movie First Look Unveiled By Star Writer Vijayendra Prasad

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.