Social News XYZ     

Kaushal Manda’s Right Movie First Look And Motion Poster Launched By Victory Venkatesh

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ కౌషల్ మండా నటించిన "రైట్" చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల

మహంకాళి మూవీస్ పతాకం పై కౌషల్ మండా మరియు లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్". మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన 'మెమోరీస్' చిత్రం రీమేక్ ఇది. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ "కౌషల్ మండా నటించిన రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌషల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి విజయం సాధించాలి. మోషన్ పోస్టర్ బాగుంది. కౌషల్ కి ఈ చిత్రం సక్సెస్ కావాలి" అని కోరుకున్నారు.

 

హీరో కౌషల్ మండా మాట్లాడుతూ "బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఈ చిత్రం చేశాను. నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వెంకటేష్ గారితో విడుదల చేయాలి అని చాలా కాలంగా వెయిట్ చేస్తున్న, కరోనా వల్ల చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నా కోరిక తీరింది. వెంకటేష్ గారు నా సినిమా పోస్టర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం జీతూ జోసెఫ్ గారి మెమోరీస్ చిత్రం రీమేక్ ఇది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మీరు అందరు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఉంటాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలో థియేటర్ లో విడుదల అవుతుంది. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు తెలుగు ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేసి విన్నర్ ని చేశారు. మీ అందరికీ గుర్తుగా నేను నా హృదయానికి దగ్గరగా టాటూ వేయించుకున్నాను. మీ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలి, అలాగే నా రైట్ చిత్రాన్ని చూసి నన్ను బ్లెస్స్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు దివాకర్ గారు మరియు లూకాలపు మధు గారికి ధన్యవాదాలు. 40 ఏళ్ల గా ప్రతి క్రాఫ్ట్ లో ఎంతో అనుభవం ఉన్న శంకర్ గారు ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. మన నిర్మాత దివాకర్ గారు సంజీవిని బ్లడ్ బ్యాంక్ తరపున లక్షల మందికి సహాయం చేశారు. నాకు చారిటీ అంటే ఇష్టం. దివాకర్ గారి ప్రతి మంచి పనికి నేను తోడుగా ఉంటాను. టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు"

నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ "బిగ్ బాస్ విజయం తర్వాత తొలిసారి కౌషల్ మండా హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి లుక్ ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు. షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు

నిర్మాత లుకలాపు మధు మాట్లాడుతూ "మా రైట్ మూవీ మొదటి పోస్టర్ ను మోషన్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు. కౌషల్ గారు బిగ్ బాస్ తర్వాత ఈ చిత్రం లో హీరో గా నటించారు. కథ చాలా బాగుంది. మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.

చిత్రం పేరు : రైట్ (Right)

బ్యానర్ : మహంకాళి మూవీస్

నటి నటులు : కౌషల్ మండా, లీషా ఎక్లైర్స్, 30 ఇయర్స్ పృథ్వి, ఆమని, ముక్తార్ ఖాన్ , తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల

కెమెరా మాన్ : ఈ వి వి ప్రసాద్

ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్

ఎడిటర్ : తిరుపతి రెడ్డి

పి ఆర్ ఓ : పాల్ పవన్

కో - డైరెక్టర్ : రఘు వర్ధన్, భిక్షు

డైరెక్టర్ : శంకర్

నిర్మాతలు : మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు

Facebook Comments
Kaushal Manda's Right Movie First Look And Motion Poster Launched By Victory Venkatesh

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.