Social News XYZ     

Souls movie teaser is very grand: Director Venkatesh Maha

సోల్స్ చిత్ర టీజర్ గ్రాండ్ గా ఉంది: దర్శకుడు వెంకటేష్ మహా !!!

మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు. అనే కథా నేపథ్యంతో రెండు సోల్స్ మధ్య జరిగే ప్రయాణాన్ని సిక్కిం లోని అరుదైన ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తిచేస్కోని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న చిత్రం సోల్స్. త్రినాధ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్ర టీసర్ ను వాలెంటైన్ డే సందర్భంగా ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా గారు విడుదల చేసారు..

ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ ... టీసర్ చూస్తుంటే సినిమా మ్యూజికల్ లవ్ స్టొరీలా బాగుంది, ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన త్రినాథ్ వర్మ మరియు భావన సాగి లు చాలా బాగా నటించారు సోల్స్ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.

 

పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్ పై విజయలక్ష్మి వేలూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు శ్రావణ్ ఈ చిత్రం తో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రతిక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ సంగీతం అందించారు. శశాంక్ శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Facebook Comments
Souls movie teaser is very grand: Director Venkatesh Maha

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.