Social News XYZ     

Sonia Agarwal’s Detective Satyabhama Movie To Release on December 31st

సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ డిసెంబర్ 31 న థియేటర్స్ లో విడుదల

సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రం ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుంది.

సోనీ అగర్వాల్ మాట్లాడుతూ... ‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ "డిటెక్టివ్‌ సత్యభామ" ఆవుతుంది ఎందుకంటే మూవీ పోస్టుపొడక్షన్ అంత ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది , ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.

 

చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .. చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దామని చిత్రాన్ని ఈ నెల డిసెంబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు

దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ .. ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించానని ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నాని అన్నారు .

నటీ నటులు :
సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌
నిర్మాత : శ్రీశైలం పోలె మోని
సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి
కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి
డైలాగ్‌ : సంతోష్ ఇంగాని
పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి

Facebook Comments

%d bloggers like this: