Social News XYZ     

Swecha Creations In Association With GA2 Pictures Launches Ambajipeta Marriage Band Movie

జీఏ2పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ప్రారంభం

100 ప‌ర్సెంట్ ల‌వ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండ‌గే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని నిర్మించిన జీఏ2పిక్చ‌ర్స్ వారు వినూత్న‌మైన క‌థ‌ల్ని, నూత‌న ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హించే క్ర‌మంలో భాగంగా రియలిస్టిక్ సినిమాల్ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌ వెంక‌టేశ్ మ‌హా స‌మ‌ర్ప‌కుడిగా క‌ల‌ర్ ఫొటో ఫేమ్ సుహాస్ హీరోగా తెర‌కెక్కిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ఈ సినిమాను జీఏ2పిక్చ‌ర్స్ వారు మ‌రో నిర్మాణ సంస్థ స్వేచ్ఛ క్రియేష‌న్స్ తో క‌లిసి నిర్మిస్తున్నారు.

యువ నిర్మాత ధీర‌జ్ మోగిలినేని ఈ సినిమాను నూత‌న ద‌ర్శ‌కుడు ధుశ్యంత్ క‌టిక‌నేనితో క‌లిసి తెర‌కెక్కిస్తున్నారు. క‌ల‌ర్ ఫొటో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సుహాస్ ఈ సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధం అవుతున్నారు. హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో జ‌రిగిన ఈ సినిమా పూజాకార్య‌క్ర‌మానికి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు హాజ‌రై క్లాప్ కొట్టారు, అనంత‌రం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు స్క్రిప్ట్ ను అంద‌జేశారు. స్టార్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర నిర్మాత ధీజ‌ర్ మోగిలినేని తెలిపారు

 

హీరో - సుహాస్

టైటిల్ - అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, మ‌హాక్రియేష‌న్స్

స‌మ‌ర్ప‌ణ‌ - వెంక‌టేశ్ మ‌హా

నిర్మాత - ధీర‌జ్ మోగిలినేని

ద‌ర్శ‌కుడు - దుశ్యంత్ క‌టిక‌నేని

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Facebook Comments
Swecha Creations In Association With GA2 Pictures Launches Ambajipeta Marriage Band Movie

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.