Social News XYZ     

Tamasoma Jyotirgamaya Trailer Released By Minister KTR

మంత్రి కేటీఆర్ విడుదల చేసిన తమసోమా జ్యోతిర్గమయా ట్రైలర్

మల్లేశం', 'కాంచివరం' తరహాలో చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన చిత్రం 'తమసోమా జ్యోతిర్గమయ'. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మిస్తున్న చిత్రమిది. గుణ ఎంటర్ టైమెంట్స్ సమర్పణ. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేయగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా పద్మజ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల అవుతున్న సందర్బంగా బుధవారం తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రసాద్ లాబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

సహా నిర్మాత సాయి కార్తీక్ మాట్లాడుతూ .. ట్రైలర్ చాల బాగుంది. ఈ సినిమా చూసాకా చాలా నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ అనుకున్నాం. నిజంగా ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి. మన నిజజీవిత కథలు ఇవి. ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయన్న నమ్మకంతో ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నాం . ఇప్పటికే అమెరికాలో ఎనిమిది సెంటర్స్ ఓకే అయ్యాయి. నేటి తరానికి ఇలాంటి చేనేత కళలు, చేనేత రంగంలోని వ్యక్తుల జీవితాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఈ నెల 29న ఈ సినిమా విడుదల అవుతుంది అన్నారు.

 

నిర్మాత తడక రమేష్ మాట్లాడుతూ .. ఈ సినిమా విషయంలో నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఏ పని చేసిన కూడా దేవుడు నాకు ఎప్పుడు పూర్తీ సహకారం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమా విషయంలో కూడా నాకు చాలా నమ్మకం కలగడానికి కారణం గుణ ఎంటర్ టైనేమేంట్ కార్తీక్ గారు. నాకు కార్తీక్ రూపంలో మంచి దోస్త్ దొరికాడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్న రుషిక మేడం కు కూడా థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారి కథ. వారి జీవితాల నేపథ్యంలో తెరకెక్కించాం. మారుతున్న కాలాన్ని బట్టి చేతివృత్తుల వాళ్ళు కూడా మారగలిగితే చాలా మంది కి ఉపాధి దొరుకుంటుంది అని చెప్పే ఉద్దేశం ఇది. అలాగే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయన సినిమా ట్రైలర్ చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ సినిమా విషయంలో మీకు నేను సపోర్ట్ ఇస్తానని అన్నారు. నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి మరోసారి థాంక్స్ చెబుతున్నాను. తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ .. పోచంపల్లి చుట్టుపక్కల పరిసరాల్లోనే పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న సినిమా ఇది. ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. 'తమసోమ జ్యోతిర్గమయ' 2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితిని ఈ చిత్రంలో చూపించబోతున్నాం, ఈ కథను నమ్మి నాకు సపోర్ట్ అందించిన నిర్మాత తడక రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కరోనా పరిస్థితుల్లో విడుదల అవుతుందా లేదా అన్న సంశయంలో ఉన్న మాకు గుణ ఎంటర్ టైనేమెంట్స్ కార్తీక్ గౌడ్ గారు వరల్డ్ వైడ్ గా సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చినందుకు అయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్, శ్రావణి చాలా చక్కగా నటించారు. ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికి మా టీం అందరు ఏంతో సపోర్ట్ చేసారు. వారికి నా ధన్యవాదాలు. ముక్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న సురేష్ కొండేటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్న గణేష్ అన్న గారికి థాంక్స్. చాలా మంచి కథ, నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు.

హీరో ఆనంద్ రాజ్ మాట్లాడుతూ .. ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చిన గుణ ఎంటర్ టైనేమెంట్స్ వారికీ థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. అందరికి నచ్చే మంచి కథతో తెరకెక్కించాం. తప్పకుండా అందరు సపోర్ట్ చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ శ్రావణిశెట్టి మాట్లాడుతూ .. విజయ్ గారు థాంక్స్ సోమచ్.. ఈ సినిమాలో నన్ను హీరోయిన్ గా తీసుకున్నందుకు. అలాగే నిర్మాత గారికి కూడా. వీవర్ ఎలా కష్టపడతాడో అన్నది నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు అన్ని బాగా తెరకెక్కించాడు. అలాగే టెక్నీకల్ అంశాలు కూడా బాగా వచ్చాయి . ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలంటే ఇలాంటి సినిమాలను ఆదరించాలి. తప్పకుండా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ చిత్రానికి
సంగీతం : మార్క్ కె ప్రశాంత్
కెమెరా : శ్రవణ్ జీ కుమార్
ఆర్ట్ : సైని భరత్.
దర్శకత్వం : విజయ్ కుమార్ బడుగు
నిర్మాత : తడక రమేశ్
పిఆర్ ఓ : సురేష్ కొండేటి.

Facebook Comments
Tamasoma Jyotirgamaya Trailer Released By Minister KTR

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: