Social News XYZ     

Telugu movie Gem review and rating

జెమ్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "జెమ్". ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న "జెమ్" చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

చిత్రం: జెమ్
సంగీతం - సునీల్ కశ్యప్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ - ఐ ఆండ్రూ నిర్మాత - పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం - సుశీల సుబ్రహ్మణ్యం.

 

జెమ్ (విజయ్ రాజ) ఒక అనాధ, కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని రక్షిద్దాం అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి శ్రీలక్ష్మి ( రాశి సింగ్) తో ప్రేమలో పడతాడు. అదే అమ్మాయిని విలన్ అజయ్ వివాహం చేసుకోవాలి అనుకుంటాడు, చివరికి శ్రీలక్ష్మి ఎవరికి దక్కుతుంది ? ఈ కథలో కనకదుర్గ (నక్షత్ర)ఎవరు ? ఆమె పాత్ర ఏంటి ? అన్నది తెలియాలంటే వెండితెరపై చూడాలి.

విశ్లేషణ:
హీరో విజయ్ రాజ అనాధ పాత్రలో బాగా నటించాడు, హీరోయిన్స్ రాశి సింగ్, నక్షత్ర పాత్రలు కథలో కీలకం, వారు సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. ముఖ్యంగా నక్షత్ర సెకండ్ హాఫ్ లో నిగిటీవ్ రోల్ లో మెప్పించింది. దర్శకుడు సుబ్రమణ్యం ఒక హానెస్ట్ కథను రాసుకున్నాడు. దానిని తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కొత్త దర్శకుడైన ఎక్కడా తడబడకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో జెమ్ సినిమాను తెరకెక్కించారు. నిర్మాత పత్తికొండ కుమారస్వామి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా రిచ్ గా తీశారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి సినిమాను నిర్మించారు.

ఈ సినిమాకు కెమెరామెన్ ఆంధ్రు మరో ప్లస్. ఆయన కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ నీట్ గా ఉంది. సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. నేపధ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకొని వెళ్ళింది. నటుడు రచ్చ రవి పాత్ర బాగుంది, తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. సంపూర్ణేష్ బాబు రోల్ డిఫరెంట్ గా ఉంది. మరో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిర్చి హేమంత్ పాత్ర కితకితలు పెట్టిస్తుంది. అజయ్ మాస్ పాత్రలో మెప్పించాడు, విలనిజం బాగా పండించాడు. దర్శకుడు సుబ్రమణ్యం నటీనటులందరిని అందరిని బాగా సెలెక్ట్ చేసుకున్నాడు, వారితో అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు.

కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు జెమ్ సినిమా తప్పకుండా నచ్చుతుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమాను చూడవచ్చు. దర్శకుడు సుబ్రమణ్యం, నిర్మాత పత్తికొండ కుమారస్వామి ఈ సినిమాను అందరికి నచ్చేలా తీశారు. హీరో విజయ్ రాజా మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రేటింగ్: 3/5

Telugu movie Gem review and rating

Facebook Comments
Telugu movie Gem review and rating

About SR

%d bloggers like this: