Social News XYZ     

Bhoodaan Ramachandra Reddy Life Is Ideal For The Country: Director Neelakanta

దేశానికే ఆదర్శం రామచంద్ర రెడ్డి గారి జీవితం : నీలకంఠ
( ప్రధమ భూదాన్ వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్ )

1951 సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే.. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞంగా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. శనివారం ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నీలకంఠ, నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి, చిత్ర సమర్పకులు అరవింద్ రెడ్డి, ప్రమోద్ చంద్ర రెడ్డి, మహాదేవ్ విద్రోహి, సహా నిర్మాతలు గడ్డం రవి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహాదేవ్ విద్రోహి మాట్లాడుతూ .. 1951 సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథ నేటి తరాలకు తెలియచేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు అన్నారు.

 

నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ .. దేశంలోనే ప్రధమ భూదాత అయిన వెదిరె రామచంద్ర రెడ్డి గారి జీవిత కథను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి యోధుల కథలు విన్నాం... అలాగే రామచంద్ర రెడ్డి గారు ఒక్క రక్తపు బొట్టు పడకుండా పేదలకు తన భూమిని దానం గా ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహనీయుడి గురించి భావి తరాలు తప్పకుండా తెలుసోకోవాలి, అందుకే వారి మనవడు అరవింద్ రెడ్డి తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. రామచంద్ర రెడ్డి గారు వినోబా భావే ఆశయాలతో పనిచేసారు అందుకే ఈ రోజు వినోబా భావే జయంతి సందర్బంగా ఆయనను నివాళులు అర్పిస్తున్నాం అన్నారు.

దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ .. ఈ రోజు నా కెరీర్ లోనే ఫైన్ మోవ్మెంట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే నేను చేయబోయే కథ. నేను ఎప్పుడు గాంధీకి పైన, అయన సిద్ధాంతాలపైనా సినిమా చేయాలనీ కోరిక ఉండేది. అలాంటి అవకాశం ఇది. ఇండియాలో రెండు అద్భుతాలు జరిగాయి.. ఒక్క రక్తపు బొట్టు పడకుండా భూదానం జరిగింది. అలాంటి భూదాతగా దేశానికి గర్వకారణంగా నిలిచినా వ్యక్తి కథను తెరకెక్కించే అవకాశం ఇచ్చిన చంద్ర శేఖర్ రెడ్డి గారికి థాంక్స్. ఇది కమర్షియల్ సినిమా కాదు. అలాగని డాక్యుమెంట్ గా చేయలేము.. చాలా జాగ్రత్తగా తెరకెక్కించే సినిమా. ఇది సాధారణమైన సినిమా కాదు. పెద్ద బరువు బాధ్యతను నాపై పెట్టారు. రామచంద్ర రెడ్డి గారు ఇచ్చిన మొదటి భూదానం దేశానికి కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర. తప్పకుండా నా శాయశక్తులా కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన చంద్ర శేఖర్ రెడ్డి గారికి, అరవింద్ రెడ్డి గారికి, గడ్డం రవి, కృష్ణ గౌడ్ లకు థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

సమర్పకులు అరవింద్ రెడ్డి మాట్లాడుతూ .. 1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.

Facebook Comments
Bhoodaan Ramachandra Reddy Life Is Ideal For The Country: Director Neelakanta

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: