Social News XYZ     

Honey Trap Movie Release Date Announcement Press Meet – Gallery

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 17 న విడుదలవుతున్న "హానీ ట్రాప్"

సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. గతంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వలస, గల్ఫ్ లాంటి సందేశాత్మక సినిమా నిర్మించి విడుదల చేసారు. ఇప్పుడు హనీ ట్రాప్ అనే సమకాలీన కథ తో సెప్టెంబర్ 17 న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నారు. విడుదల తేది తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించారు.

చిత్ర నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ ...నాకు సునీల్ కుమార్ గారితో పరిచయం లేదు.నా మిత్రుడు పి.యల్.కె రెడ్డి గారు పరిచయం చేశారు.తనకు నా దగ్గర ఉన్న లైన్ చెప్పడంతో ఆ లైన్ తను డెవెలప్ చేయడంతో తనతో ఈ సినిమాను స్టార్ట్ చేశాను. సునీల్ కుమార్ గారు ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాలు తీసినా అందులో అండర్ కరెంట్ మెసేజ్ తప్పకుండా ఉంటుంది. తను తీసిన రొమాంటిక్ సినిమాలన్నీ కమర్షియల్ గా విజయం సాధించాయి. ఆ సినిమామాలకంటే భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మంచి మైలేజ్ వస్తుందనే నమ్మకం ఉంది.. మేము విడుదల చేసిన సాంగ్స్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ వారు మాతో ఈ సినిమా ట్రైలర్స్, టీజర్ చూసి చాలా సీన్స్ కట్ చేయాలని చూశాము. కానీ సినిమా చూసిన తరువాత ఇందులోని సీన్స్ కట్ చేస్తే మూల కథకు ఇబ్బంది అవుతుందని సీన్స్ కట్ చేయలేదు సినిమా బాగుందని చెప్పి సెన్సార్ వారు మమ్మల్ని ప్రశంశించి 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది మేము గ్రేట్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాము. ఈ సినిమాను ఓటిటి లో విధుల చేయమని చాలా మంది సలహాలు ఇచ్చారు.కానీ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రం థియేటర్స్ లలో చూస్తే బాగుంటుందని బాపిరాజు గారి సపోర్ట్ తో మేము "హానీ ట్రాప్" చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేరుకున్న ఈ సినిమాను ఈ నెల 17 న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.అలాగే మా బ్యానర్లో సునీల్ కుమార్ రెడ్డి గారితో మరిన్ని చిత్రాలు తీస్తాము అని అన్నారు

 

చిత్ర హీరో రిషి మాట్లాడుతూ.. హీరోగా నా మొదటి సినిమా కు సీనియర్ దర్శకుడుతో పని చేస్తానని అనుకోలేదు.మా నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తీశాడు. ఇందులో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు

చిత్ర హీరోయిన్ మాట్లాడుతూ .. నాకు ఇందులో మంచి పాత్ర ఇచ్చారు. అందరి సపోర్ట్ తో ఇందులో నేను చేసిన పాత్ర అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు

లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ.. సునీల్ గారు గత చితాలు రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ లను దాటి ఈ సినిమా చెయ్యడం జరిగింది.మా పోస్టర్స్ ను చూసిన చాలా మంది రచ్చ రచ్చ చేస్తూ మీకు థియేటర్స్ లలో ఇక ఈ సినిమాకు కాసుల వర్షమే అని అంటున్నారు. పూర్తిగా పండంటి కాపురం సినిమా తీసినా, సతీ సావిత్రి లాంటి సినిమాలు తీసినా కొద్ది మంది మాత్రమే చూస్తారు. అయితే మేము తీసిన ఈ సినిమాలో పండంటి కాపురం కు సంబంధించి ఉంది, , సతీ సావిత్రి కి సంబంధించి ఉంది, మరియు రచ్చ రచ్చ చేసే రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా. నిర్మాత ఖర్చుకు వెనుకడకుండా టెక్నికల్ ఎం కావాలో అన్నీ సమకూర్చ డంతో సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే దర్శకుడు సునీల్ గారు అద్భుతమైన టేకింగ్ తో తను తీసిన ఈ సినిమా గత సినిమాలకంటే భిన్నంగా ఉంటుంది. నటీనటులు అందరూ కొత్తవారైనా కొత్తవారినే ఫీలింగ్ లేకుండా చాలా బాగా నటించారు.ఈ సినిమా బిజినెస్ కొరకు అన్ని జిల్లాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా మంచి బిజినెస్ అవుతుంది అన్నారు.

పి.యల్.కె.రెడ్డి మాట్లాడుతూ ... నా మిత్రుడు వామనరావు గారు కరోనా టైం లో నాకు ఫోన్ చేసి ఒక మంచి సినిమా చేయలను కుంటున్నానని ఒక లైన్ చెపితే దర్శకుడిగా సునీల్ కుమార్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. తనైతే ఈ సినిమాకు కరెక్ట్ న్యాయం చేస్తాడని సునీల్ గారిని రిఫర్ చేయడం జరిగింది.అలా మా జర్నీ స్టార్ట్ అయ్యింది.సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 17 న విడుదల అవుతున్న ఈ సినిమా దర్శక,నిర్మాత లకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. నేను చేసిన గత సినిమాలకంటే ఎలా డీఫ్రెంట్ అంటే నేను ఎప్పుడూ నా సొంత కథలతోనే సినిమా చేసే వాణ్ణి, కానీ మా నిర్మాత వామన రావు గారు కథ చెప్పడం జరిగింది. కథ విన్న వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేనెప్పుడూ కాన్టెంపరరీ కథలు చేస్తుంటాను. మీరు కూడా కాన్టెంపరరీ సబ్జెక్ట్ ఉన్న మంచి కథ చెప్పారు అన్నాను. తను చెప్పిన కథ డెవెలప్ చేసి సినిమా చెయ్యడం జరిగింది.వామనరావు గారు చాలా సెన్సిబుల్ రైటర్ , నంది అవార్డు పొందిన నాటకాలను రచించిన గొప్ప రచయిత అయిన తను చాలా టెస్ట్ ఉన్న నిర్మాత తనతో వర్క్ చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. సొంతవూరు, గంగపుత్రులు చేస్తున్నప్పటి నుండి పి.యల్.కె రెడ్డి గారితో మా ఇద్దరి అనుబంధం ఉంది.ఇంతమంచి సినిమా చేసే అవకాశం కల్పించిన తనకు నా ధన్యవాదాలు.ఇందులో నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. మా "గల్ఫ్" సినిమాలో నటించిన డింపుల్ బాలీవుడ్ కు ఎలా వెళ్ళిందో..అలాగే ఈ చిత్రం లో నటించిన వారందరికీ అలాగే మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.నా గత 15 సినిమాల నుండి నాకు మిత్రుడిగా,శ్రేయోభిలాషి గా,ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి లక్ష్మీ పిక్చర్స్ అధినేత బి. బాపిరాజు గారు ఈ సినిమాను తనే ప్రమోట్ చేసి విడుదల చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ నెల 17 న విడుదల అవుతున్న మా "హానీ ట్రాప్" సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

Facebook Comments

%d bloggers like this: