Social News XYZ     

Prakash Raj Launched The 3rd Character Poster From 1997 Movie

'1997' చిత్రంలోని హీరో మోహన్ లుక్ విడుదల చేసిన ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ముడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు. తాజగా 1997 చిత్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు . తాజాగా హీరో మోహన్ లుక్ ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విడుడల చేశారు.

అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నాను, సాంగ్ చూసాను. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు యాక్టర్ , డాక్టర్ మోహన్ లుక్ నీ విడుదల చేస్తున్నాను. ఏ ఇష్యూ మీద సినిమా తీసారో తెలుసు. 1997 అనేది టైటిల్ ఉండొచ్చు, కానీ ఈ రోజు కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి. 1997 లో జరిగినట్టు కాదు, ఈ రోజు మన కళ్లముందు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోట్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాను అంటే, సినిమా అనేది హీరో అవ్వడానికి, హీరోయిన్ అవ్వడానికి, సంపాదించడానికి కాదు, మన చుట్టూ, మన మధ్య ఉన్న సమస్యలేమిటి, దానిమీద మన అవగాహన ఏమిటి, దానిమీద మన దృష్టి ఏమిటి, దాన్ని ఎలా జనాల దగ్గరికి తీసుకెళ్లాలి, ఇలాంటి సమస్యలను చూపించేందుకు సినిమా అన్నది బిగ్ ప్లాట్ ఫాం. మోహన్ నిజంగా తన అంతకరణ శుద్ధితో ఇలాంటి సమస్యలను జనాల దగ్గరికి తీసుకెళ్లాలి, దానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి అని చేస్తున్న ప్రయత్నం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మోహన్ కమిట్మెంట్, డెడికేషన్ కు ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అన్నారు.

 

హీరో, దర్శకుడు డా. మోహన్ మాట్లాడుతూ .. సినిమా మరో లుక్ విడుదల చేసిన ప్రకాష్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని బర్నింగ్ ఇష్యుని తీసుకుని దానికి కమర్షియల్ హంగులతో ఈ సినిమా చేశా. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా పాల్గొన్నారు

నటీనటులు.
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు...

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్.
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.

Facebook Comments
Prakash Raj Launched The 3rd Character Poster From 1997 Movie

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.