Social News XYZ     

Deyyam Tho Sahajeevanam Movie Mandhara Kanne Mandhara Song Released

అద్భుతమైన కాశ్మీర్ అందాలను చూపిస్తూ యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన 'మందార కన్నె మందార' పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రం టీం

మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు మొదటి వారంలో 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన 'మందార కన్నె మందార' అనే అద్భుతమైన పాటను ఈ రోజు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్న సందర్భంగా

చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ… కాశ్మీర్ లోని అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన ''మందార కన్నె మందార' పాటను యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడారు. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. త్వరలో సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేసి ఆగస్టు మొదటి వారంలో 5 భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నట్టి కరుణ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది. బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేను దర్శకత్వం వహించే ఈ ‘DSJ‘(దెయ్యంతో సహ జీవనం) చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.కరోనాటైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.

 

చిత్ర నిర్మాతలు నట్టి క్రాంతి, అనురాగ్ కంచర్లలు మాట్లాడుతూ… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది. చిత్రంలోని నటీనటులందరూ చాలబాగా నటించారు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో సుపూర్ణ మాలకర్ నటించారు. అలాగే కోటి గారి అబ్బాయి రాజీవ్ కూడా ఇందులో నటించాడు. కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాము. అందరూ బాగా సహకరించడం వలన సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము. 'DSJ‘ (దెయ్యంతో సహజీవనం) సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేసి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికి తప్పక నచ్చుతుందని అన్నారు..

నటీనటులు:
నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్,రాజీవ్ ,
హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ : అనురాగ్ కంచర్ల
డైరెక్టర్: నట్టి కుమార్
నిర్మాత: నట్టి క్రాంతి
కెమెరామెన్: కోటేశ్వర రావు
సంగీతం: రవిశంకర్
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: కెవి.రమణ
ఫైట్స్: కె.అంజిబాబు
లిరిక్ రైటర్ : రాంబాబు కోసాన
పి ఆర్.ఒ: మధు.విఆర్

Facebook Comments
Deyyam Tho Sahajeevanam Movie Mandhara Kanne Mandhara Song Released

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.