Social News XYZ     

Namasthe Set Ji Movie 1st Look Is Out

నమస్తే సేట్ జీ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ లక్ష్మి నిర్మాణ సారథ్యంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "నమస్తే సేట్ జీ". సాయికృష్ణ ,స్వప్న చౌదరి హీరో హీరోయిన్లు గా టార్జాన్ లక్ష్మణ్ , శాంతి స్వరూప్, శ్రీనివాసులు తదితరులు నటిస్తున్న ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ "ఫ్రెంట్ లైన్ వారియర్స్ చేసే సేవల్ని చూపిస్తూ, అలానే ఈ సమాజంలో కనపడని శ్రామికులు గా ఉన్న కిరాణా షాపు లు నడిపించుకునే సామాన్య కుటుంబాల కథ ఇది అని నిర్మాత అన్నారు.

 

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ "మొదటి సారి లాక్డౌన్ లో కిరాణా షాపు వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి ఈ కథను సిద్ధం చేసాం,
మనకు నిత్యం ఉపయోగపడే ప్రతి వస్తువు పిన్ను నుండి పెన్ను దాకా, కూరగాయలు మొదలు అన్ని నిత్యావసర సరుకులు లభించేవి కేవలం కిరాణం షాపులోనే, అలాంటి కిరాణా దుకాణం నడిపించే సేట్ ల జీవన శైలిని, కరోనా సమయంలో నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి సరుకులు అందిస్తూ వారి జీవితాల్ని సైతం రిస్క్ లో పెట్టిన వారి దైర్య సాహసలని ఈ సినిమా లో చూపిస్తున్నాం అని అన్నారు. మనం చిన్నప్పటి నుండి ఏ షాపు వాళ్లనైనా సేటు, సేట్ జీ అంటూంటాం , ఆ వాడుక భాషని ఆధారంగా చేసుకొని ఈ సినిమా ని తిస్తున్నాం. సెకండ్ వేవ్ కరోనా సమయంలో కిరాణా షాపు వాళ్లు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని అన్నారు..

ఈ సినిమా కి తల్లాడ శ్రీలక్ష్మీ నిర్మాణ సారథ్యం

కో-ప్రొడ్యూసర్ ;-పొట్టిముతి గౌతమ్, శ్రీ కౌశిక్ గుప్తా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- అశోక్ నిమ్మల,విజయ్ నిట్టల,చందు

రచన - రమేష్ కుమార్ వెలుపుకొండ, శివ కాకు

సంగీతం;- వి.ఆర్.ఏ.ప్రదీప్ ,కార్తిక్ కొడకండ్ల,

పబ్లిసిటీ డిజైన్స్ - కార్తీక్ అండ్ రాహుల్ చిల్లలే,

క్రియేటివ్ హెడ్-వివేకానంద విక్రాంత్,

సౌండ్ ఎఫ్ఎక్ట్స్;- వెంకట్,

కెమెరా - శివ రాథోడ్, సైదులు, శ్రీకాంత్,

పి.ఆర్.ఓ- పాల్ పవన్,

సాహిత్యం- చింతల శ్రీనివాస్, సంధ్యవర్షిని, శరత్ చంద్ర

Facebook Comments
Namasthe Set Ji Movie 1st Look Is Out

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: