Social News XYZ     

Alia Bhatt’s Gangubai Kathiawadi Movie Telugu Teaser Gets Good Response

ఆక‌ట్టుకుంటోన్నఅలియా భట్ `గంగూబాయి క‌తియ‌వాడి` తెలుగు టీజ‌ర్..‌

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన "మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై" అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. తాజాగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' స్క్రీనింగ్ థియేటర్లలో 'గంగూబాయి కతియావాడి' తెలుగు టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

``కామాఠిపుర‌లో అమావాస్య రాత్రి కూడా అంధ‌కారం ఉండ‌దు అని అంటారు ఎందుకంటే..అక్క‌డ గంగు ఉంటుంది...అనే వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైన ఒక‌టిన్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. గంగు చంద్రిక చంద్రునిలానే ఉంటుంది లాంటి డైలాగ్స్‌తో పాటు చివ‌ర‌లో నేను గంగుబాయి ప్ర‌సిడెంట్ కా‌మాఠిపుర మీరు కుమారి అంటూనే ఉన్నారు..న‌న్ను శ్రీ‌మ‌తి ఎవ‌రూ చేసిందేలేదు..వంటి డైలాగ్స్‌కి విశేష స్పందన వస్తుంది. యంగ్ బ్యూటీ అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది ? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గంగూబాయి క‌తియ‌వాడి చిత్రం విడుదలవుతుంది.

 

Facebook Comments

%d bloggers like this: