Social News XYZ     

Lawyer Saab Trailer: India’s First Ever Cover Trailer For A Movie Released

ఇండియన్ సినిమా ఫస్ట్ ఎవర్ కవర్ ట్రైలర్ వకీల్ సాబ్‌కు ట్రిబ్యూట్‌గా వచ్చిన లాయర్ సాబ్ కవర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది : సురేష్ కొండేటి

ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లోని సాంగ్స్‌కి ఫ్యాన్స్ కవర్ సాంగ్స్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కవర్ సాంగ్స్ కోసం భారీగా కూడా ఖర్చు చేస్తుంటారు. ఈ కవర్ సాంగ్స్ యూట్యూబ్‌లో బాగా ట్రండ్ అవుతాయి కూడా. కొంతమంది ఈ కవర్ సాంగ్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే భారత సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సినిమా ట్రైలర్‌కి కవర్ ట్రైలర్ చేయడం ఆసక్తికరంగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ నుంచి ఇటీవల ట్రైలర్‌ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి వకీల్ సాబ్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ అప్పుడు పవర్ స్టార్ అభిమానులు అద్దాలు బద్దలు కొట్టుకుని మరీ వెళ్లి థ్రియేటర్లలో ట్రైలర్‌ను ఎక్స్ పీరియన్స్ చేశారు. ఇలాంటి ట్రైలర్‌కు ట్రిబ్యూట్‌గా ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించిన సంతోషం అధినేత, సినీ నిర్మాత సురేష్ కొండేటి.. పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన షకలక శంకర్‌ను లీడ్ రోల్‌లో పెట్టి ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌కు కవర్ ట్రైలర్‌ను నిర్మించారు. లాయర్ సాబ్ అంటూ టైటిల్ పెట్టి కవర్ ట్రైలర్ చేసి ఆదివారం విడుదల చేశారు. ఇందులో షకలక శంకర్ లాయర్ సాబ్‌గా కనిపించారు. వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవర్ స్టార్ చెప్పిన డైలాగులను మార్చి షకలక శంకర్ చెప్పడం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ లాయర్ సాబ్ ట్రైలర్‌లో నిర్మాత సురేష్ కొండేటి జడ్జిగా కనిపించడం మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఈ కవర్ ట్రైలర్ చివరిలో పవర్ స్టార్ అభిమానులు ఎలా ఉంటారో ఆయన సినిమాల మీద ఎంత క్రేజ్ ఉంటుందో కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఈ కవర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. ఒక సినిమా ట్రైలర్‌కు కవర్ ట్రైలర్ రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ లాయర్ సాబ్ ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది.

 

సురేష్ కొండేటి సెట్ చేసిన ఈ ట్రెండ్‌ను ముందు ముందు ఏ హీరో అభిమానులు కొనసాగిస్తారో చూడాలి.

Facebook Comments
Lawyer Saab Trailer: India's First Ever Cover Trailer For A Movie Released

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz