మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన నాగార్జున, అహిషోర్ సాల్మన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ 'వైల్డ్ డాగ్' ట్రైలర్
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. యథార్థ ఘటనలను ఆధారం చేసుకొని రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మ అనే ఒక వైవిధ్యమైన పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైల్డ్ డాగ్ ట్రైలర్‌ను షేర్ చేసిన ఆయన, "Presenting #WildDogTrailer .. FEROCIOUS,PATRIOTIC TALE OF A DAREDEVIL TEAM.. My brother Nag is Cool & Energetic as ever.. He is a fearless actor attempting all genres.. Wish Team #WildDog & my Producer Niranjan Reddy GoodLuck!" అని ట్వీట్ చేశారు.
2 నిమిషాల 24 సెకన్ల నిడివి ఉన్న వైల్డ్ డాగ్ ట్రైలర్ చూస్తున్నంత సేపూ ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉంది. పాకిస్తానీ టెర్రరిస్టులు మన దేశంలో సాగించిన మారణకాండ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. బాంబ్ బ్లాస్టులతో వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఏసీపీ విజయ్ వర్మ నేతృత్వంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టీమ్‌ను ఒకదాన్ని ప్రభుత్వం నియమిస్తుందనీ, అక్కడ్నుంచీ విజయ్ వర్మ తన బృందంతో టెర్రరిస్టులను వెంటాడుతాడనీ ట్రైలర్ మనకు చూపిస్తుంది.
విజయ్ వర్మ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ తెలియజేసింది. తమను పట్టుకోవడానికి విజయ్ వర్మ టీమ్ వచ్చినప్పుడు ఒక క్రిమినల్, "అరెస్ట్ చేసుకోండి సార్" అని సింపుల్‌గా చేతులు పైకెత్తితే, క్షణం ఆలస్యం చేయకుండా అతడిని విజయ్ వర్మ కాల్చి పడేశాడు. అదీ విజయ్ వర్మ క్యారెక్టర్! అందుకే అతడిని అందరూ 'వైల్డ్ డాగ్' అనేది!
ట్రైలర్ చివరలో ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ నాయకుడు, "ఏం చేస్తార్రా ఇండియాకి తీసుకెళ్లి? వారానికి రెండు సార్లు బిర్యానీ, జడ్ క్యాటగిరి సెక్యూరిటీ, కుక్కల్లా కాపలాగా ఉంటారు." అని హేళనగా నవ్వుతుంటే, వైల్డ్ డాగ్ చేతిలోని గన్ పేలడం మనం గమనించవచ్చు. క్రిమినల్స్‌కు, టెర్రరిస్టులకు పక్కలో బల్లెం లాంటి ఏసీపీ విజయ్ వర్మ క్యారెక్టర్‌లో నాగార్జున ఫెరోషియస్‌గా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకు ఫుల్ పవర్‌ఫుల్ యాక్షన్ రోల్ లభించింది. ఆ రోల్‌లో ఆయన విజృంభించి నటించారు.
ట్రైలర్‌లో నిర్మాణ విలువలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు. షానీల్ డియో సమకూర్చిన సినిమాటోగ్రఫీ, డేవిడ్ ఇస్మలోన్, జాషువా రూపకల్పన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర వహించనున్నది.
మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ 'వైల్డ్ డాగ్'పై అంచనాలను అమితంగా పెంచేసింది.
నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా నటిస్తోన్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచా
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్ డైరెక్టర్: డేవిడ్ ఇస్మలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
ఆర్ట్: మురళి ఎస్.వి.
స్టంట్ కో-ఆర్డినేటర్: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.