Social News XYZ     

Ee Kathalo Paathralu Kalpitam Movie Release Date Poster Released By Minister Talasani Yadav

'ఈ కథలో పాత్రలు కల్పితం' రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.. మార్చి 19 న సినిమా విడుదల..!!

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇటీవలే సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాట యూట్యూబ్ లో ఒక ట్రెండ్ ని సృష్టిస్తుంది.ఒక్కో అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. కాగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఎమ్మెల్యే, కేబినెట్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా టైటిల్ చాలా వెరైటీ గా ఉంది అన్నారు.. సినిమా మరింత వెరైటీగా ఉంటుందని ఆశిస్తున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి అల్ ది బెస్ట్.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 19 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరు చూసి ఈ సినిమా సభ్యులను ఆశీర్వదించండి అన్నారు.. అన్నారు..

 

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు..అయన ఇచ్చిన సహాయ సహకారం మర్చిపోలేనిది.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.. అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చిత్ర యూనిట్ తరపున హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరి నోటా ఈ సినిమా గురించే వినపడుతుంది. ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీలయ్యే విధంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది అంటున్నారు. మార్చి 19 న సినిమా ని ఎంతో ఘనంగా విడుదల చేస్తున్నాం.. అందరు ఈ సినిమా ని చూసి ఆశీర్వదించాలి.. ఎవరు ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్ ని ఈ సినిమాలో జోడించి డైరెక్టర్ ఎంతో అద్భుతంగా సినిమా ని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా ని చూడగలరు అని అన్నారు.

నటీనటులు:
పవన్‌ తేజ్‌, మేఘన,

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌,
సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల,
ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు,
ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌,
ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి,
డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌,
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌,
విఎఫ్ఎక్స్: విజువ‌ల్స్ ఫ్యాక్ట‌రీ(తిరు),
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ఎజె ఆర్ట్స్‌, (అజయ్ కుమార్),
నిర్మాత: రాజేష్‌ నాయుడు,
క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.

Facebook Comments
Ee Kathalo Paathralu Kalpitam Movie Release Date Poster Released By Minister Talasani Yadav

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: