Social News XYZ     

Aha World Digital Premiere of Athade Srimannarayana on Friday, February 26,2021

ఫిబ్రవరి 26 నుంచి 'ఆహా' వరల్డ్‌ ప్రీమియర్‌లో 'అతడే శ్రీమన్నారాయణ'

క్రాక్‌, సూపర్‌ఓవర్‌, మెయిల్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో 2021లో అమేజింగ్‌గా స్టార్ట్‌ చేసిన తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'.. అదే ప్రమాణాలను పాటిస్తూ మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ మరింత ఎక్కవ వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది 'ఆహా'. అందులో భాగంగా నారింజ మిఠాయి, మిడ్‌నైట్‌ మర్డర్స్‌, మాయనది చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

ఈ క్రమంలోనే ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాను ఫిబ్రవరి 26న నుంచి ప్రసారం చేస్తూ ఈ వారాంతాన్ని అడ్వెంచరస్‌గా మార్చింది ఆహా.

 

అద్బుతమైన విజువల్‌ టెక్నిక్స్‌తో అతడే శ్రీమన్నారాయణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఫాంటసీ, డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది.

అమరావతి అనే కాల్పనిక నగరంలో నిధి అన్వేషణ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నిధి కోసం రెండు వేర్వేరు గ్యాంగులు పోటీపడుతున్నప్పుడు మన హీరో శ్రీమన్నారాయణ ఏం చేశాడనేదే సినిమా కథాంశం.

అతి కొద్ది సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ ప్రపంచంలో ఆహా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించే సూపర్‌స్టార్స్‌ నటించిన క్లాసిక్‌ సినిమాల కలెక్షన్స్‌తోపాటు ఒరిజినల్స్ కలెక్షన్స్‌ ఆహా సొంతం.

నటీనటులు:
రక్షిత్‌ శెట్టి, శాన్వి శ్రీవాత్సవ, బాలాజీ మనోహర్‌, అచ్చుత కుమార్, ప్రమోద్‌ శెట్టి, మధుసూదన్‌ రావ్‌
సాంకేతిక వర్గం:
బ్యానర్‌: పుష్కర్‌ ఫిలింస్‌
దర్శకత్వం: సచిన్‌
నిర్మాత: పుష్కర మల్లిఖార్జునయ్య
రచన: రక్షిత్‌ శెట్టి, ది సెవెన్‌ ఆడ్స్‌
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, చరణ్‌ రాజ్‌
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అజనీష్‌ లోక్‌నాథ్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: కరమ్‌ చావ్లా
ఎడిటర్‌: సచిన్‌

Facebook Comments
Aha World Digital Premiere of Athade Srimannarayana on Friday, February 26,2021

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: