Social News XYZ     

Anasuya Bharadwaj Performs A Special Item Song In Chaavu Kaburu Challaga Movie

అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు యంగ్ హీరో కార్తికేయ "చావు క‌బురు చ‌ల్ల‌గా " చిత్రంలో అన‌సూయ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'.

‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.

 

అలానే ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేశారు. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు..

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం..

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత - బ‌న్నీ వాసు
దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌- స‌త్య జి
ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి

Facebook Comments
Anasuya Bharadwaj Performs A Special Item Song In Chaavu Kaburu Challaga Movie

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: