Social News XYZ     

Everyone Is Shocked To See My Performance In The Movie Climax Natakirti Rajendra Prasad

"క్లైమాక్స్" సినిమాలో నా నటనను చూసిన వారంతా షాక్ అవుతారు - నటకిరీటి రాజేంద్రప్రసాద్

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ తో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విదంగా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో "క్లైమాక్స్" సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నామని అంటున్నారు చిత్ర దర్శకుడు భవాని శంకర్.
కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా సింగ్,శ్రీ రెడ్డి,పృద్వి,శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం "క్లైమాక్స్". ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు* *యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని "క్లైమాక్స్" చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు . అనంతరం

యఫ్.డి.సి.చైర్మన్,ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. భవాని శంకర్ తీసిన డ్రీమ్ ఫిల్మ్ చూశాను . చాలా బాగుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే డిఫ్రెంట్ గా ఉంది.రాజేంద్రప్రసాద్ గారు క్యారెక్టర్ అద్భుతంగా ఉంది.ఏ పాత్ర ఇచ్చినా ఈజీ గా నటించే రాజేంద్రప్రసాద్ గారితో "క్లైమాక్స్" సినిమాను భవాని శంకర్ తీశాడు . డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న భవాని శంకర్ తను తీసిన "డ్రీమ్" ఫిల్మ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఈ మూవీ కూడా అంత కంటే పెద్ద హిట్ అయ్యి తనకు మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

 

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..రాజేంద్రప్రసాద్ గారి జీవిత చరిత్ర చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.పోరాటమే జీవితంగా నిరంతరం తను కష్టపడతాడు. చాలా చిన్న వయసులోనే ఇంజనీరింగ్ చదివి ,గోల్డ్ మెడిలిస్ట్ తీసుకొన్న రాజేంద్రప్రసాద్ గారు యన్. టి.రామారావు గారి సినిమాల ఇన్స్పిరేషన్ తో ఆర్టిస్ట్ అవ్వాలని మద్రాస్ కు వెళ్లి ఎంతో కష్టపడి డబ్బింగ్ అరిస్ట్,అరిస్ట్,హీరో గా ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చాడు.ఏ పాత్ర ఇచ్చినా సినిమాలో ఆయన కనపడడు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది.అలాంటి నటుడితో భవాని శంకర్ తీస్తున్న "క్లైమాక్స్" ట్రైలర్ చూస్తే చాలా డిఫ్రెంట్ గా ఉంది.ఇప్పటికే భవాని శంకర్ తానేంటో ప్రూవ్ చేసుకొన్నాడు.తను తీసిన "డ్రీమ్" సినిమాకు ఎన్నో ఇంటర్ నేషనల్ అవార్డులు తీసుకున్నాడు. కెనడాలో ఏ తెలుగు సినిమాకు రాని అవార్డ్ భవాని శంకర్ సినిమాకు వచ్చింది.ఇప్పుడు వస్తున్న ఈ "క్లైమాక్స్" సినిమా కూడా నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ గా కూడా బిగ్ హిట్ అయ్యి ఎన్నో అవార్డులు ఈ సినిమాకు రావాలని కోరుతున్నానని అన్నారు..

నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. భవాని శంకర్ ఒక డిఫ్రెంట్,టఫ్ సబ్జెక్ట్ తో నా ముందుకు వచ్చాడు.ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయనటువంటి పాత్రలో నటించాను.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా షాక్ కు గురవుతారు.మనం సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశాము అనే దానికంటే మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ఇంపార్టెంట్. అందరి సపోర్ట్ తో ఈ మూవీ ప్రేక్షకులందరికీ
రీచ్ అవ్వాలి అప్పుడే ఇలాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు.తను తీసిన డ్రీమ్ సినిమా కమర్షియల్ గా ఎంతో హిట్టయింది.ఆ సినిమాకు తను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు .ఇప్పుడు మళ్లీ "క్లైమాక్స్" చిత్రం ద్వారా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు.ఇలాంటి మంచి మూవీలో అద్భుతమైన పాత్ర ఇచ్చిన భవానీశంకర్ నా కృతజ్ఞతలు.ఇందులో ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.నేను చేసిన గెటప్స్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి నటించడం జరిగింది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందని
అభినందించడమే కాక మీరే 100 మందికి చూడమని చెప్పేలా ఉంటుందని అన్నారు.

చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ.. నేను 2007 లో "ఐ వోట్ ఫ్రెండ్స్" షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. 300 సినిమాల్లో ఈ సినిమాకు బెస్ట్ క్రిటిక్స్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అది సీ.ఎన్.ఎన్ & ఐ.బీ.ఎన్ ఛానల్స్ లలో కూడా ప్రసారం అయ్యింది.ఆ తర్వాత నేను 2011లో "డ్రీమ్" సినిమా తీశాను. దీనికి ఏడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

అందులో ప్రామినెంట్ గా కెనడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ,న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ రెండు ప్రామినెంట్ గా వచ్చాయి.ఏ తెలుగు సినిమా కూడా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ థియేటర్లో ఎప్పుడూ స్క్రీన్ చేయలేదు. డ్రీమ్ మూవీ ఫస్ట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో "క్లైమాక్స్" తో మీ ముందుకు వస్తున్నాను.రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప యాక్టర్. 40 సంవత్సరాల నుండి ఒక హీరోగా, కమెడియన్ గా, తాతగా అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు.ఒక ఎస్.వి.రంగారావు తర్వాత
నాకు రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తున్నారు. "క్లైమాక్స్" సినిమా మిస్టరీ, మర్డర్ మిస్టరీతో పాటు టర్న్స్ అండర్ బ్యాక్ డ్రాప్ కామెడీతొ ఒకటిన్నర గంట నిడివి ఉన్న మూవీ తీయడం జరిగింది. ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి.హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉన్న సినిమాగా విజువల్ బ్యూటీకి బాగా ప్రామినెంట్ ఇస్తూ మ్యూజిక్ కి పెద్దపీట వేసి తీసిన సినిమా క్లైమాక్స్ .ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ పెద్ద సినిమాలతో మేము వస్తున్నాము.మా సినిమా కంటెంట్ చాలా పెద్దది .ప్రొడ్యూసర్స్ కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు చాలా మంచి నిర్మాతలు ఇలాంటి క్రియేటివ్ మూవీస్ కు ప్రొడ్యూసర్స్ సహకారం ఉన్నందున ఈ మూవీ చాలా బాగా వచ్చింది. వారికి ధన్యవాదాలు. చిత్ర యూనిట్ లో అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. టెక్నికల్ టీమ్ లో రవికుమార్ నిర్లా చనిపోవడం చాలా బాధాకరం. ప్రతి ఫ్రెమ్ లో బ్యూటి తీసుకు రావడానికి అతని పాత్ర ఎంతో ఉంది. రాజకుమార్ గిబ్స్ ఆర్ట్ డైరెక్టర్ ప్రతి చిన్న దానిని కుడా ఎంతో కేర్ తీసుకొని తీశారు.ఈ సినిమాకు మీరు ఎప్పుడూ వినని మ్యూజిక్ ను రాజేష్ అందించాడు.మూడు పాటలు చాలా బాగా వచ్చాయి.త్వరలో ఆడియో ను విడుదల చేసి సినిమా విడుదలకు ప్లాన్ చేస్తామని అన్నారు.

హీరోయిన్ సాషా సింగ్ మాట్లాడుతూ.. ఇటువంటి డిఫరెంట్ కథా చిత్రం లో రాజేంద్రప్రసాద్ గారితో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.

నటీనటులు

నటకిరీటి రాజేంద్రప్రసాద్, శశ సింగ్,శ్రీ రెడ్డి,పృద్వి,శివ శంకర మాస్టర్,రమేష్ ,తదితరులు

సాంకేతిక నిపుణులు

ప్రొడక్షన్ హౌస్ :- కై పాస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్

ప్రొడ్యూసర్స్ :- రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి

డైరెక్టర్ :-భవాని శంకర్ కె

ఎడిటర్ :-బసవ పైడి రెడ్డి
మ్యూజిక్ :- రాజేష్, నిద్వాన

సినిమాటోగ్రఫీ :- రవి కుమార్ నీర్ల

ఆర్ట్ డైరెక్టర్ :-రాజ్ కుమార్, రవి (ముంబై)

కొరియోగ్రఫీ :-ప్రేమ్ రక్షిత్

Facebook Comments
Everyone Is Shocked To See My Performance In The Movie Climax Natakirti Rajendra Prasad

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: