Social News XYZ     

Maranam First Teaser Launched By C Kalyan

మరణం మొదటి టీజర్ ను విడుదల చేసిన అగ్ర నిర్మాత సి. కళ్యాణ్

శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో. వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం "మరణం". కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక . ఈ సినిమా మొదటి టీజర్ ను అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసారు.

అనంతరం సి. కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా లో పని చేసిన దర్శకుడు హీరో వీర్ సాగర్ కి హీరోయిన్ శ్రీ రాపాక కి మరియు ఈ సినిమా కి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కి మంచి భవిష్యతు ఉంటుంది. హారర్ చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటె సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ అవాలి అని కోరుకుంటున్న. మంచి కథ కుదిరితే ఈ వీర్ సాగర్ మరియు శ్రీ రాపాక కాంబినేషన్ లో నేను మరో సినిమా చేస్తాను" అని తెలిపారు.

 

దర్శకుడు హీరో వీర్ సాగర్ మాట్లాడుతూ "సి కళ్యాణ్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. నేను కష్టాల్లో ఉన్నపుడు నాకు సహాయం చేసారు. నా జీవితాంతం కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను. ఇంత మంచి మనసున్న కళ్యాణ్ గారు నా మొదటి టీజర్ ను విడుదల చేయటం చాలా సంతోషం. మంచి కథ ఉంటె చెప్పు సినిమా చేద్దాం అని కళ్యాణ్ గారు నాకు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు మళ్ళి చెప్తున్నారు. నాకు చాలా సంతోషం గా ఉంది. రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప డైరెక్టర్ తో సినిమా చేసిన తర్వాత శ్రీ రాపాక గారు నా సినిమా చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. తనని చాలా మంది ఈ సినిమా చేయొద్దు అని అన్నారు కానీ తాను కథ ను నమ్మింది నన్ను నమ్మింది. నేను శ్రీ రాపాక గారి నమ్మకాన్ని వమ్ము చేయను.

శ్రీ రాపాక మాట్లాడుతూ "మా మరణం సినిమా టీజర్ ను విడుదల చేసిన సి. కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. కళ్యాణ్ గారు మా లాంటి చిన్న నటి నటులకి టెక్నిషన్స్ కి గాడ్ ఫాదర్. ప్రతి విషయంలోనూ సహాయపడతారు. నేను కథ ను నమ్ముతాను, వీర్ సాగర్ గారి కథ నచ్చి సినిమా చేస్తున్నాను. సినిమా బాగా వస్తుంది మరియు వీర్ సాగర్ గారు చాలా హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. అయ్యన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఈ సినిమా చేస్తునప్పుడే డైరెక్టర్ గారు నాకు ఇంకో కథ చెప్పారు, నాకు బాగా నచ్చింది, సి. కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి టెక్నీషియన్ కష్టపడి పని చేసారు. సినిమా తప్పకుండ విజయవంతం అవ్వుతుంది" అని తెలిపారు.

నటి నటులు : వీర్ సాగర్, శ్రీ రాపాక, మాధురి

బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్

సమర్పణ : శ్రీమతి బి రేణుక

చిత్రం పేరు : మరణం

కెమెరా మాన్ : కె వి వరం

సంగీతం : మనోజ్ కుమార్ చేవూరి

ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్

ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ

డి.ఐ : రవి తేజ

ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్

కాస్ట్యూమ్స్ : నీలిమ

  1. 1 మిక్సింగ్ : వెంకట్ రావు

పబ్లిసిటీ డిజైన్ : షాహిద్

ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ

మేకప్ : వంశి కృష్ణ

డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్

పి ఆర్ ఓ : పాల్ పవన్

Facebook Comments
Maranam First Teaser Launched By C Kalyan

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.