Social News XYZ     

Sumanth’s Kapatadhaari Movie To Release February 19th

ఫిబ్ర‌వ‌రి 19న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సుమంత్‌, క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ చిత్రం `క‌ప‌ట‌ధారి`

సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌క‌ప‌ట‌ధారి. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్‌ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు క‌ప‌ట‌ధారి అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన కావ‌లుధారి సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాత డా.ధ‌నంజ‌యన్ మాట్లాడుతూ కొత్త క‌థాంశాలతో రూపొందే చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆద‌రిస్తారో అంద‌రికీ తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే క‌ప‌ట‌ధారి నిర్మించాం. సుమంత్‌గారు త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సంప‌త్ రాజ్, జ‌య‌ప్ర‌కాశ్‌, నందిత అందరి పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌ప‌ట‌ధారి సినిమాను రూపొందించాం. చాలా ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న భారీగా విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

 

న‌టీన‌టులు:

సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాత‌: డా.జి.ధ‌నంజ‌య‌న్‌
యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌
మ్యూజిక్‌: సైమ‌న్ కె.కింగ్‌
ఆర్ట్‌: విదేశ్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
మాట‌లు: బాషా శ్రీ
స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌: డా.జి.ధ‌నంజ‌య‌న్‌
క‌థ‌: హేమంత్ ఎం.రావు
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

Facebook Comments
Sumanth's Kapatadhaari Movie To Release February 19th

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: