Social News XYZ     

Sri Annapurna Creations Production Number 6 Movie Launched

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 6 షురూ

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6 చిత్రం రెగ్యులర్ షూటింగ్ అరకు లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం లో నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్నారు. వినోదభరితమైన కథ కథనం అరకులోని అందమైన లొకేషన్స్ లో నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ "శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ లో మొత్తం మూడు సినిమా నిర్మాణంలో ఉన్నాయి. రెండు చిత్రాలను తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా మరో సినిమా ని విక్రాంత్ దర్శకత్వం చేస్తన్నారు. ప్రస్తుతం తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం లో వస్తున్నా ప్రొడక్షన్ నెంబర్ 6 వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అరకు లో ప్రారంభం అయింది. త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను" అని తెలిపారు.

 

హీరో, దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "ఎప్పటినుంచో అందమైన అరకు లొకేషన్స్ లో వినోద భరిత ప్రేమకథ చేయాలి అనే కోరిక ఉండేది, ఇప్పుడు ఆ కోరిక ఈ చిత్రం తో నెరవేరబోతోంది. వినోద భరితమైన కుటుంబ ప్రేమకథ చిత్రం తో త్వరలో మీ ముందుకు వస్తాము" అని తెలిపారు.

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ "నేను హీరోయిన్ గా చేస్తున్న మొదటి సినిమా ఇది, కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, నా పాత్రకి ఈ సినిమా లో చాలా స్కోప్ ఉంటుంది" అని అన్నారు.

బ్యానర్ : శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్

కెమెరా మాన్ : శివ రాథోడ్

సంగీతం : వి.ఆర్.ఏ .ప్రదీప్ మరియు పవన్

మాటలు: శివ కాకు, రమేష్ వెలుపుకొండ,

ఫైట్ మాస్టర్:- శ్యామ్ కరద.

Sri Annapurna Creations Banner ,

New Movie Opening ,
A Film By Thallada Saikrishna .

Producer :- Thallada Srinivas,
Casting :- Thallada Saikrishna , Nakshatra.

Facebook Comments