Social News XYZ     

Kichcha Sudeep’s First Look From Kabzaa Movie Released

'కన్నడ' సూపర్ స్టార్ ఉపేంద్ర 'కబ్జా' అనే పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించినట్టు తెలిసిన విషయమే. ఇది మన దేశంలోనే 7 వివిధ భాషల్లో విడుదల కాబోతుంది.

ఈ చిత్రానికి ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఉపేంద్ర - చంద్రు కాంబినేషన్లో కన్నడంలో బ్రహ్మ మరియు ఐ లవ్ యూ అనే సినిమాలు వచ్చాయి. తెలుగు లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే సినిమా సుధీర్ బాబు తో కూడా దర్శకత్వం వహించారు. ఈ కబ్జా అనే సినిమా ఉపేంద్ర - చంద్రు కాంబినేషన్లో మూడవ చిత్రం.

సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద ప్రకటన ఉంది అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ లో, 'U + ?' అని రాసి, ఎవరు జాయిన్ కాబోతున్నారో కనుగొనండి అని ఉంది. అందులో ఉన్న 'U', చిత్ర కథానాయకుడు ఉపేంద్ర అనేది స్పష్టంగా తెలియగా, సినిమాలో కథానాయిక అనుకుంటూ ఆ తరువాత మల్టీస్టారర్ చిత్రాల పోస్టర్లు కలగలిపిన పోష్టర్ల్ వదిలారు.

 

వీటి అన్నిటికి తెర తీస్తూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ '?' అనేది 'కన్నడ' బాద్షా కిచ్చా సుదీప్ యొక్క లుక్ ని వదిలారు. అందులో 'భార్గవ్ భక్షి' 1947-1986 అని ఉండగా. ఆ పాత్ర సుదీప్ పోషించబోతున్నారు అని కనిపిస్తుంది. మాఫియా ను అంతం చేసే ఒక పాత్ర అని పోస్టర్ మీద రాసి ఇంకాస్త ఆసక్తిని పెంచారు చిత్ర టీమ్.

ఇంతకు ముందే ఉపేంద్ర- సుదీప్ కాంబినేషన్లో 'ఓ మై గాడ్' హిందీ సినిమా యొక్క కన్నడ రీమేక్ చేశారు. అయితే, ఇది దానికి పూర్తి వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తుంది పోస్టర్లు చూస్తేనే. ఇక ఉపేంద్ర - సుదీప్ కాంబినేషన్లో మరొక్కసారి రాబోతున్న పాన్ ఇండియా సినిమా 'కబ్జా' ఎలా ఉండబోతోందో, రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ఆర్ట్: శివ్ కుమార్

ఎడిటర్: మహేష్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: ఎ.జె.షెట్టి

మ్యూజిక్: రవి. బస్రూర్

సమర్పణ: లాంకో శ్రీధర్

నిర్మాణం: శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్

నిర్మాతలు: ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా

రచన - దర్శకత్వం: ఆర్. చంద్రు

Facebook Comments
Kichcha Sudeep's First Look From Kabzaa Movie Released

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: