Social News XYZ     

Akshara Releasing In Feb 2021

ఫిబ్రవరి లో రిలీజ్ కానున్న "అక్షర"

నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: న్యూ ఈయర్ సందర్భంగా మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు హీరో అడివి శేష్ కు ముందుగా థాంక్స్. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా ‘‘అక్షర’మూవీ’ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పుడు పరిస్థితులన్ని చక్కబడ్డాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నాం.ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం. ’’ అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కెమెరామాన్ : నగేష్ బెనల్ సంగీతం : సురేష్ బొబ్బిలి ఎడిటర్ : జి.సత్య ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్ నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ రచన - దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

 

Facebook Comments
Akshara Releasing In Feb 2021

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.