Social News XYZ     

Nallamala Movie Motion Poster Launched By Trivikram – Gallery

వాస్తవ సంఘటనలతో వస్తోన్న ‘నల్లమల’

కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు నిరసనలు చేస్తున్నారు. అసలు నల్లమలకు ఏమైంది. ఆ అడవిని ధ్వంసం చేయాలని చూస్తున్నది ఎవరు.. వంటి విషయాలను చర్చిస్తూ.. అలాంటి అంశాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ గొప్ప వీరుని కథే ‘నల్లమల’.నల్లమల నేపథ్యంలో రకరకాల పాయింట్స్ చుట్టూ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి.

కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను ఆవిష్కరిస్తూ సాగే కథ ఇది. ఇలాంటి చీకటి ఒప్పందాలకు వ్యతిరేకంగా తన భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కిరించడు అంటూ పూర్తిగా వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే సినిమాగా వస్తోంది నల్లమల. వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా తెరకెక్కుతోందీ చిత్రం.

 

కథే ప్రధాన బలంగా వస్తోన్న నల్లమల చిత్రం లో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్,
ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి

ఎడిటర్ : శివ సర్వాణి
ఫైట్స్ : నబా
విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్
ఆర్ట్ : యాదగిరి
పి.ఆర్.వో : దుద్ది శ్రీను
సినిమాటోగ్రఫీ : వేణు మురళి
సంగీతం, పాటలు : పి.ఆర్
నిర్మాత : ఆర్.ఎమ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్

Facebook Comments
Nallamala Movie Motion Poster Launched By Trivikram - Gallery

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: