Social News XYZ     

Mr And Mrs Movie Is Set To Release In January

జనవరి లో విడుదలకు సిద్దమవుతున్న "మిస్టర్ అండ్ మిసెస్" మూవీ

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ జనవరి 2021 లో రిలీజ్ ప్లాన్ చేస్తునట్లు చిత్ర యూనిట్ చెప్పారు..

'ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతుంది. కొన్నాళ్లకు ఆ ఇద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో బయటకు వస్తుంది. మరి ఆ తర్వాతేమైందీ' అనేదే ఈ చిత్ర కథగా దర్శకుడు చెబుతున్నాడు.

 

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, ఆర్ట్ డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Facebook Comments
Mr And Mrs Movie Is Set To Release In January

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: