Social News XYZ     

Dhruva Sarja And Rashmika’s Pogaru Telugu Rights Acquired By D Prathap Raju For 3.3 Crores

క‌న్న‌డ, తెలుగు రాష్ట్రాల్లో క‌‌రాబు క‌రాబు చేసిన దృవ స‌ర్జా పోగ‌రు తెలుగు హ‌క్కుల‌ని 3.30 కొట్ల కి సొంతం చేసుకున్న డి.ప్ర‌తాప్‌రాజుగారు

క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన పొగ‌రు సాంగ్ ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌న్న‌డ లో ఈ సాంగ్ విడుద‌లయ్యిన ద‌గ్గ‌ర‌నుండి మిలియ‌న్స్ మిలియ‌న్స్ వ్యూస్ తో రికార్డు లు సాదించింది. త‌రువాత తెలుగులొ కూడా త‌న పొగ‌రు చూపించాడు స్టార్ హీరో దృవ స‌ర్జా.. తెలుగు లో ఈ పొగ‌రు అనే టైటిల్ తో వ‌స్తున్న ఈ సినిమా కి వ‌చ్చిన క్రేజ్ కి చాలా మంది తెలుగు రైట్స్ కొసం పొటి ప‌డ‌గా 3 కొట్ల‌కి పైగా ఫ్యాన్సి రేటుతో వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజుగారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు లొ సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత డి.ప్ర‌తాప్ రాజుగారు మాట్లాడుతూ.. ఇటీవ‌ల ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో టివి ఛాన‌ల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ లో వున్న పొగ‌రు క‌న్న‌డ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మా సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో 3 కొట్ల 30 ల‌క్ష‌ల‌కి సొంతం చేసుకున్నాము. ఈ సినిమా సాంగ్ క‌న్న‌డ‌లో 170 మిలియ‌న్స్ పైగా వ్యూస్ తెలుగు లో 43 మిలియ‌న్స్ వ్యూస్ కి పైగా రావ‌టం అతి పెద్ద రికార్డని చెప్పాలి. ఇంత క్రేజ్‌వ‌చ్చిన సినిమాకి మ‌న టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేష‌న్ రాగా మా సంస్థ సొంతం చేసుకొవ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో సైమంటెన్స్ గా విడుదల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. క‌న్న‌డ టైటిల్ పొగ‌రు కాగా తెలుగు లో ఇంకా టైటిల్ క‌న్‌ఫార్మ్ చేయ‌లేదు. అతిత్వ‌ర‌లో ఈ సినిమా రేంజ్ కి త‌గ్గ‌ట్టుగా తెలుగు లో టైటిల్ ని ఎనౌన్స్ చేస్తాము. అలాగే వ‌స‌‌రుస‌గా మూడు సూప‌ర్‌హిట్స్ తో డ‌బుల్‌ హ్య‌ట్రిక్ కి శ్రీకారం చుడుతూ క‌న్న‌డ‌లో దూసుకుపోతున్న దృవ స‌ర్జా, టాలీవుడ్ లో ఏ సినిమా లో న‌టిస్తే ఆసినిమా సూప‌ర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచుర‌ల్ బ్యూటి ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ద్య వ‌చ్చిన క‌రాబు సాంగ్ విజువ‌ల్ గా అంద‌ర్ని విప‌రీతం గా ఆక‌ట్టుకుంటుంది. రిపీట్ గా చూస్తున్నారంటే ఈ చిత్రం పై క్రేజ్ ఏంరేంజ్ లో వుందొ తెలుస్తుంది. త‌రువాత వ‌చ్చే సాంగ్స్‌, ట్రైల‌ర్ ఇంత‌కి మించి వుంటుంది. ఈ సినిమా కి ద‌ర్శ‌కుడు నంద‌న్ కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి న‌చ్చేలా తెర‌కెక్కించారు. మ్యూజిక్ ద‌ర్శ‌కులు చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య లు ఇచ్చిన ప్ర‌తి సాంగ్ సంచ‌ల‌నం కాబోతుంది. ఈ చిత్రంలో మ‌రో క్రేజ్ గా డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ లో ఫేమ‌స్ ఫైట‌ర్స్ కాయ్ గ్రీనే, మోర్గ‌న్ అస్తే ,జో లిండ‌ర్‌, జాన్ లోక‌స్ లు ఈ చిత్రం లో విల‌న్స్ గా న‌టిండం విశేషం. ఈ న‌లుగురి బాడి బిల్డ‌ర్స్ కి దృవ స‌ర్జా కి మ‌ద్య యాక్ష‌న్ స‌న్నివేశారు స‌బ్ర‌మాశ్చ‌ర్య‌‌ప‌రుస్తాయి. ఇలాంటి చాలా స‌ర్‌ప్రైజ్ లు ఈ చిత్రం లో డైర‌క్ట‌ర్ క్రియెట్ చేశాడు. ఇంకా మ‌రిన్ని విష‌యాల్ని మ‌రోక్క‌సారి తెలియ‌జేస్తాం..అని అన్నారు.

 

బ్యాన‌ర్‌.. సాయి సూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం.. చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య‌
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
నిర్మాత‌.. డి.ప్ర‌తాప్ రాజు
ద‌ర్శ‌కుడు.. నంద‌న్ కిషోర్‌

Facebook Comments
Dhruva Sarja And Rashmika's Pogaru Telugu Rights Acquired By D Prathap Raju For 3.3 Crores

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.