Social News XYZ     

Madrasi Gang Movie Launched With Clap By Manchu Manoj

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ‘‘మద్రాసి గ్యాంగ్’’ ప్రారంభం

పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి ‘‘మద్రాసి గ్యాంగ్’’ అనే కొత్త సినిమా తీస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని అజయ్ ఆండ్రూస్ నూతంకి డైరెక్ట్ చేయనున్నారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలు హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగాయి.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఎన్ రెడ్డి మాట్లాడుతూ: మా బ్యానర్ లో ఇంతకు ముందు మంచు మనోజ్ తో ‘‘ఒక్కడు మిగిలాడు’’ మూవీ తీసిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమవుతుంది.హిందీ,తమిళ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. మెయిన్ లీడ్ గా సంతోష్,రంగ జిను నటిస్తున్నారు. హీరో మంచు మనోజ్ గారు వచ్చి కెమెరా స్విచ్చాన్ చేసి, విషెస్ అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్థతలు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూమార్ ఈ మూవీ థీమ్ పోస్టర్ ను లాంచ్ చేశారు.అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వచ్చి విషెస్ తెలియజేశారు.వాళ్లందరికీ థాంక్స్.’’ అన్నారు.

 

నటీనటులు: సంతోష్, రంగ జిను, తదితరులు.

టెక్నీషియన్స్:

సినిమాటోగ్రఫీ: వి.కె రామరాజు
మ్యూజిక్: ఎన్.ఎస్ ప్రసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : శివ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.వి.వి సత్యనారాయణ
లైన్ ప్రొడ్యూసర్స్: ధరణి కుమార్,రాధాకృష్ణ తాతినేని
నిర్మాత : ఎస్.ఎన్ రెడ్డి
రచన,దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతంకి.

Facebook Comments
Madrasi Gang Movie Launched With Clap By Manchu Manoj

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.