Social News XYZ     

Puli Bidda movie in Vikky master direction announced

విక్కీ మాస్టర్ దర్శకత్వంలో 'పులి బిడ్డ'

రాయలసీమ నేపథ్య కథా చిత్రమనగానే అధికశాతం ఫ్యాక్షన్ ప్రధానాంశమని అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా రాయలసీమలో అహింసను కోరుకునే శాంతి కాముకులు వున్నారనే అంశాన్ని ఆవిష్కరిస్తూ.... 'పులి బిడ్డ' పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. దీనికి 'చెప్పిందే చేస్తాడు' అన్నది ఉప శీర్షిక. రాజా ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్-2గా రూపొందనున్న ఈ చిత్రానికి విక్కీ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో పలువురు అగ్ర హీరోల చిత్రాలకు ఫైట్స్ మాస్టర్ గా పనిచేయడంతో పాటు గతంలో 'పోలీస్ సిస్టర్స్, ఖాకీ చొక్కా, అశోక చక్రం' చిత్రాలకు విక్కీ మాస్టర్ దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే వుంటుంది.

కాగా ఈ తాజా చిత్రం గురించి దర్శకుడు విక్కీ మాస్టర్, కథా రచయిత యస్.ఎం.బాషా మాట్లాడుతూ... రెగ్యులర్ రాయలసీమ చిత్రాలకు భిన్నంగా ఉంటూ... రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. అధికారంలో వున్న యువ ముఖ్యమంత్రికి శత్రువులు అడుగడుగునా అడ్డు తగులుతున్నప్పటికీ వారిపై కక్ష తీర్చుకోకుండా వారిలో మార్పు తీసుకొని రావడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. విజయదశమి రోజున చిత్రం షూటింగ్ ను ఒంగోలులో ప్రారంభిస్తాం. పాత, కొత్త నటీనటుల సమ్మేళనంతో రూపొందించే ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ సీనియర్ నటులు నటిస్తారు. మిగతా వివరాలను త్వరలో తెలియజేస్తాం అని చెప్పారు.

 

ఈ చిత్రానికి కథ: యస్.ఎం.బాషా, సినిమాటోగ్రఫీ: భగవతి బాల, ప్రొడక్షన్ కంట్రోలర్: చీమకుర్తి ప్రభాకరరావు, నిర్మాణం: రాజా ఫిలిమ్స్, ఫైట్స్, దర్శకత్వం: విక్కీ మాస్టర్.

Puli Bidda movie in Vikky master direction announced

Facebook Comments