Social News XYZ     

Tanga Productions LLP 2nd Film Launched

కొత్తవాళ్లతో టాంగా ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడక్షన్ నెం.2 లాంచ్.

అంతా కొత్త నటీనటులతో విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా టాంగా ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై , నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథులు గా నిర్మాత మధుర శ్రీధర్,డైరెక్టర్ కృష్ణ చైతన్య హాజరయ్యారు.

ఈ సందర్భం గా ప్రొడ్యూసర్ విజయ్ దశి మాట్లాడుతూ : ''మా మొదటి చిత్రం ఆనంద్ దేవరకొండ హీరోగా షూటింగ్ దశలో ఉంది.ఇప్పుడు రెండో చిత్రంగా కొత్తవాళ్లతో మంచి లవ్ స్టోరీ తీయబోతున్నాం. ‘‘Whistling Woods International’’ లో ఫిలిం కోర్స్ చేసిన కుర్రాడు పృథ్వీసేన రెడ్డి చెప్పిన ఒక ఇంటెన్స్ లవ్ స్టోరి నచ్చడం తో వెంటనే ఓకే చేశాం. తెలుగు,తమిళ భాషలలో రూపొందనున్న ఈ మూవీ కోసం కొత్త నటీనటులను తీసుకోవాలనుకున్నాం. అందుకే సుమారుగా 500 మందిని ఆడిషన్స్ చేసి నటీనటుల్ని ఎంపిక చేసాం..వాళ్ల వివరాలు త్వరలో తెలియజేస్తాం.అక్టోబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి , ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు.

 

బ్యానర్:టాంగా ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి

పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ : వాసు పెండెం
సంగీతం : సన్నీ ఎం ఆర్
పాటలు : చంద్రబోస్,కృష్ణచైతన్య ,రాంబాబు గోసాల

నిర్మాతలు:విజయ్ దశి ,ప్రదీప్ ఎర్రబెల్లి

రచన,దర్శకత్వం : పృథ్వీసేన రెడ్డి

Facebook Comments
Tanga Productions LLP 2nd Film Launched

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.