Social News XYZ     

Cine Musicians Union Pays Homage To Shri Late SPB

గాన గంధర్వునికి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళి!!

భువి నుంచి దివికేగిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రఘు కుంచె, సురేఖామూర్తి, అనూప్ రూబెన్స్, రవివర్మ, శ్రీకాంత్, వేణు, మణి- నాగరాజ్, బల్లేపల్లి మోహన్, రవిశంకర్, ఎం.వి.కె.మల్లిక్, శివరామ్ వింజమూరి, కె.ఎం.రాధాకృష్ణ,- ఎస్.ఏ.ఖుద్ధూస్, వెంగీ సుధాకర్, మాధవి తదితరులు బాలు గొప్పతనాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన పలువురు ప్రముఖులు జూమ్ యాప్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. వారిలో కె.రాఘవేంద్రరావు, మాధవపెద్ది సురేష్, మనో, రామాచారి, కోటి, ఎం.ఎం.శ్రీలేఖ, శ్రీరామచంద్ర, వినోద్ బాబు, పార్థసారథి, శారదాసాయి, వి.కనకదుర్గ, శ్రీకృష్ణ, కౌసల్య, నూతన, సందీప్, శశికళ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు!!

 

Facebook Comments
Cine Musicians Union Pays Homage To Shri Late SPB

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.