Social News XYZ     

There Is A Very Good Response To Saheba’s Role In V Movie: Aditi Rao Hydari

`వి` చిత్రంలో సాహెబా పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది‌ : అదితిరావు హైదరి

అదితిరావు హైదరి.. మన హైదరాబాదీ అమ్మాయి. అయితే కెరీర్‌ ప్రారంభంలో మలయాళ, హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తూ వచ్చారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత అంతరిక్షం సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి ఇంద్రగంటి దర్శకత్వంలో అదితిరావు హైదరి నటించిన మరో చిత్రం వి. ఈ చిత్రంలో సాహెబా పాత్రలో అదితిరావు హైదరి అందరినీ అలరించారు. సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన వి సినిమా గురించి వెబినార్‌లో పాత్రికేయులతో అదితిరావు హైదరి చిట్‌ చాట్‌...

  • నానితో కూడా వర్క్‌ చేయాలని అనుకుంటున్న సమయంలో ఈ స్క్రిప్ట్‌ నా దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్‌ వినగానే నాకు బాగా నచ్చింది. ఇంద్రగంటిగారు నన్ను 'సమ్మోహనం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన వర్కింగ్‌ స్టయిల్‌ నాకు తెలుసు. కాబట్టి ఓకే చెప్పాను. పాత్ర ఇరవై నిమిషాలుందా? లేక రెండు గంటలుందా? అని చూసుకోలేదు. సినిమా అంతటికీ నా పాత్రనే కనెక్టివ్‌గా సాగుతుంది. నా పాత్రను చక్కగా డిజైన్‌ చేశారు. ఇంద్రగంటిగారితో పనిచేయడం ఓ గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. నేను ఈ సినిమాలో యాక్ట్‌ చేయక ముందే నేను నానికి పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాలో తనతో కలిసి నటించిన తర్వాత తనకింకా పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాను.

     

  • నా పాత్ర సినిమాలో చనిపోతుంది. నాని, నా ప్రేమ నుండే అసలు కథ పుడుతుంది. హార్ట్‌ ఆఫ్‌ ది స్టోరి. ఎమోషన్‌ మా లవ్‌స్టోరి నుండే మొదలవుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు నా పాత్ర నిడివి ఎంత అనే దానికంటే దాని ప్రాధాన్య‌త‌నే చూస్తాను. స‌ద‌రు పాత్ర ఎంత మేరకు కనెక్ట్‌ అయ్యిందనేదే ముఖ్యం.

  • ఈ సినిమాలో నేను స్టోర్‌లో పనిచేసే అమ్మాయిగా కనిపించాను. ఈ పాత్ర కోసం నేనెలాంటి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోలేదు. చిన్నప్పుడు నేను మా ఇంట్లో గిఫ్ట్స్‌ ఇవ్వాలనుకున్నప్పుడు స్టోర్‌లకు వెళుతుండేదాన్ని మా బామ్మతో కలిసి క్రాఫ్ట్ స్టోర్స్‌కు వెళుతుండేదాన్ని.

  • ఇంద్రగంటిగారితో 'సమ్మోహనం' తర్వాత చేసిన సినిమా. సమ్మోహనం సమయంలో నాకు తెలుగు మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదు. అర్థమయ్యేదంతే. ఆయన రైటింగ్‌లో చాలా హ్యుమర్‌ ఉంటుంది. ఆయన సినిమాలో పాత్రలను చక్కగా డిజైన్‌ చేస్తారు. అందుకనే ఆయనతో సినిమా చేయడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెబుతాను. ఇంద్రగంటిగారితో కలిసి పనిచేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను.

  • సినిమా చూసిన తర్వాత చాలా మంది నన్ను అప్రిషియేట్‌ చేశారు. ధనుష్‌ నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అలాగే రాశీఖన్నా సినిమా గురించి, నా పాత్ర గురించి మెచ్చుకుంటూ మెసేజ్‌ పెట్టారు.

  • నేను నటించిన చిత్రాల్లో ఈ ఏడాది 'సుఫియం సుజాతయుమ్‌' సినిమా తర్వాత అమెజాన్‌లో విడుదలైన రెండో చిత్రం 'వి'. మరో సినిమా కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

  • మా ఫ్యామిలీలో అందరూ తెలుగు మాట్లాడుతారు. కానీ నేను మాట్లాడలేను. చాలా తక్కువగానే మాట్లాడుతాను. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నేను తెలుగు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాను. క్లాసులకు అటెండ్‌ అయ్యాను. అదే సమయంలో తమిళం నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాను. కానీ కన్‌ఫ్యూజన క్రియేట్‌ కావడంతో ఆపేశాను. నెక్ట్స్‌ తెలుగు సినిమా చేసే సమయంలో తెలుగు ట్యూటర్‌ను పెట్టుకుని నేర్చుకుంటాను. అంతే కాదు.. నాతో మాట్లాడేవారిని తెలుగులోనే మాట్లాడమని చెబుతుంటాను. తెలుగు మీద చాలా ఆసక్తి ఉంది. ఈ కారణంగా సమ్మోహనం, వి చిత్రాలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.

  • ఓ మంచి దర్శకుడు, యాక్టర్‌తో మనం సెట్‌లో ఉన్నప్పుడు ఎంత పెద్ద ఛాలెంజ్‌ అయినా సులభంగానే చేసేయగలుగుతాం. సాహెబా పాత్రను అడాప్ట్‌ చేసుకుని ప్రేక్షకులకు మంచి ఫీల్‌ కలిగించడానికి అది కూడా ఓ సాంగ్‌లోనే చూపించాలి. నేను, నాని గట్టిగానే ప్రయత్నించాం. ఇక వి సినిమాలో నాకు ఛాలెంజింగ్‌ పార్ట్‌ అంటే ..తొలి రోజునే క్లైమాక్స్‌ చిత్రీకరించాం. నేను అమ్మాయిని కాపాడుతూ.. నానిపై నా లవ్‌ను ఎక్స్‌ప్రెస్‌ చేసే సీన్‌ అది. అప్పటి వరకు నేను నాని కలవనేలేదు. కానీ తనపై ప్రేమను చూపిస్తూ మాట్లాడాలి. సీన్‌ అంతటినీ నేనే క్యారీ చేయాలి. ఛాలెంజింగ్‌గానే అనిపించింది. ఎలా చేశానో అనుకున్నాను.. కానీ ఆడియెన్స్‌ అప్రిషియేషన్‌ చూసిన తర్వాత రిలీఫ్‌గా అనిపించింది.

  • లాక్‌ డౌన్‌ సమయంలో ఇంకా ఓపికగా ఉండటం, దయగా ఇంకా ఎంత బాగా మెలగాలి.. అనే విషయాలను నేర్చుకున్నాను. దేనికీ ఎంత ప్రాధాన్యమివ్వాలనే విషయాలను నేర్చుకున్నాను. పాజిటివ్‌గా ఉండటం నేర్చుకున్నాను.

  • 'వి' సినిమాను థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యలో చూడాలని అనుకున్నాను. కానీ.. ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను మిస్‌ చేసుకున్నాను. థియేటర్స్‌ కోసం చేసిన మూవీ ఇది. లార్జ్‌ స్కేల్‌లో చేశాం. కానీ పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎంటైర్‌ యూనిట్‌తో కలిసి ఓటీటీలో 'వి' సినిమా చూశాను. బాగా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

  • జాన్‌ అబ్రహంతో సినిమా చేస్తున్నాను. ముంబైలో షూటింగ్‌లోనూ పాల్గొన్నాను. హీరో, నిర్మాతలు కరోనా వైరస్‌ వల్ల ఎలాంటి ఎఫెక్ట్‌ ఉంటుందనే విషయాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం వల్ల సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేశాం.

  • 'పొన్నియన్‌ సెల్వన్‌'లో నేను యాక్ట్‌ చేయడం లేదు. కానీ ప్రేక్షకులు నేను ఆ సినిమా చేస్తున్నారని అనుకుంటున్నారు.

  • రెండు తమిళ చిత్రాలు, మూడు హిందీ చిత్రాలు, ఓ తెలుగు చిత్రం చేస్తున్నాను. వెబ్‌ సిరీస్‌లో నటిచడం లేదు.

  • నాకు లవ్‌స్టోరీస్‌ అంటే చాలా ఇష్టం. కానీ అన్నీ తరహా మూవీస్‌లో నటించాలని అనుకుంటున్నాను. పర్టికులర్‌గా ఓ డ్రీమ్‌లో నటించాలని అనుకోవడం లేదు.

Facebook Comments
There Is A Very Good Response To Saheba's Role In V Movie: Aditi Rao Hydari

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: