Social News XYZ     

Director Puri Jagan Launched My Boyfriend’s Girlfriend Movie Trailer

 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా "మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్( నేను, సూర్య , బ్రిట్నీ )'' ట్రైలర్ విడుదల

వినాయకుడు, విలేజ్లో వినాయకుడు సినిమాల్లో కథానాయకుడిగా నటించిన కృష్ణుడు నిర్మా తగా వస్తున్న తొలి సినిమా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ను శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. తన కుమార్తె నిత్యా పేరుతో నిత్యా క్రియేషన్స్ అనే నిర్మాణసంస్థను ప్రారంభించిన కృష్ణుడు తొలి ప్రయత్నంగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను నిర్మించారు.

 

ఈ సినిమా ఫస్ట్ లుక్ హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదలై సినిమా అంచనాలను పెంచింది. తాజాగా పూరీ జగన్నాథ్ విడుదలైన చేసిన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది...శివ కుమార్, జబరదస్త్ అప్పారావు, హర్షిత చౌదరి, వర్షా రెడ్డి కాంబినేషన్ వస్తున్న ఈసినిమా యూత్ ఆడియన్స్కు ఓ ఫెస్టివల్గా ఉండబోతుంది అంటున్నారు చిత్ర యూని.

ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.అందరికి నచ్చేలా కంప్లీట్ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ గా "మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్" సినిమా ని రూపొందించాం అంటున్నారు దర్శక, నిర్మాతలు.. అతి త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ఫ్రెండ్ చిత్రం విడుదల కానుంది.

Facebook Comments
Director Puri Jagan Launched My Boyfriend's Girlfriend Movie Trailer

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: