Social News XYZ     

Actor Koti Says He Is Not Approached For Bigg Boss 4 Telugu

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు కోటి!

నటుడు, సంఘ సేవకుడు కోటి పలు చిత్రాల్లో నటించారు, కేఏ.పాల్ కు సన్నిహితంగా ఉండే నటుడు కోటి బిగ్ బాస్ తెలుగు 4 లో సెలెక్ట్ అయ్యాడని వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ లో పాటిస్పెంట్స్ గా ఎంపికైన వారిపేరు ఇవేనని పలువులు నటీనటుల పేర్లు వినిపిస్తున్నాయి అందులో నటుడు కోటి పేరు కూడా ఒకటి.

నటుడు కోటికి సినీ రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే రామ్ గోపాల్ వర్మ మరియు పవన్ కళ్యాణ్, జేడీ.చక్రవర్తికు అత్యంత సన్నిహితుడు, పలు సేవా కార్యక్రమాలు చేసిన కారణంగా ఇతను బిగ్ బాస్ లోని అడుగు పెట్టబోతున్నాడని వార్తలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది, అలాగే లక్ష్మి పార్వతి పైన నటుడు కోటి కేసు పెట్టిన సందర్భంలో ఆ వార్త పెద్ద దుమారం లేపింది. అలాగే పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ వివాదాన్ని కోటి పరిష్కరించారు, పూనమ్ కౌర్, లక్ష్మీ పార్వతి ఇలా ఇలాంటి టాపిక్స్ వచ్చినా మొదట వినపడే పేరు కోటి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అలాగే అందరూ దర్శక నిర్మాతలతో కోటికి మంచి పరిచయాలు ఉన్నాయి.

 

ఈ విషయం గురించి కోటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, సోషల్ మీడియాలో నేను బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యానని వార్తలు వస్తున్నాయి, కానీ బిగ్ బాస్ వారు నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఒకవేళ వారు నన్ను సంప్రదిస్తే నేను బిగ్ బాస్ లోని వెళ్ళడానికి సిద్ధమే'' అని తెలిపారు. ట్యాలెంట్ ఉన్న నటులు ఎక్కడైనా నిరూపించుకుంటారు అలాగే నటుడు కోటి మరిన్ని మంచి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చెయ్యాలని బిగ్ బాస్ లో కూడా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనే కోరుకుందాం.

Facebook Comments
Actor Koti Says He Is Not Approached For Bigg Boss 4 Telugu

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: