Social News XYZ     

Director Vikram Kumar Confirms Movie With Naga Chaitanya Is Not a Horror Genre

చైతు సినిమా పై డైరెక్టర్ క్లారిటీ !

విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీశారు. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. ఈసారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో సినిమాని తెర‌కెక్కించబోతున్నాడు. అయితే ఎప్పుడూ సొంత క‌థ‌లుతోనే సినిమా తీసే విక్ర‌మ్, ఈ సినిమాకి క‌థ మాత్రం విక్ర‌మ్ రాయ‌లేద‌ని, బివిఎస్ రవి – దిల్ రాజు జ‌మానాలో రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌ కు విక్ర‌మ్ త‌న స్ట‌యిల్‌లో మార్పులు చేసుకుంటున్నారని రూమర్స్ వినిపించాయి.

కాగా తాజాగా అన్ని పుకార్లకు స్వస్తి పలకడానికి విక్రమ్ కుమార్ ముందుకు వచ్చారు. చైతుతో తన చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదని, ఇది రొమాన్స్ మరియు కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్ అని ఆయన అన్నారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే షూట్ కు అవసరమైన అనుమతులను మేకర్స్ తీసుకున్నారు. మరి చైతుని విక్రమ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

 

Facebook Comments

%d bloggers like this: